స్వచ్ఛ ఆంధ్ర అవార్డు అందుకున్న డా. ఏడుకొండలు
పామూరు, మేజర్ న్యూస్ :
మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పామూరు మండలంలోని కంభాలదిన్నె ఆయుష్ ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ గద్దె ఏడుకొండలు స్వచ్ఛ ఆంధ్ర అవార్డు–2026ను అందుకున్నారు. మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత చేతుల మీదుగా డాక్టర్ ఏడుకొండలు అవార్డును స్వీకరించారు. స్వచ్ఛత కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించినందుకు గుర్తింపుగా ఈ అవార్డు అందజేశారు. అవార్డు అందుకున్న సందర్భంగా డాక్టర్ గద్దె ఏడుకొండలు మాట్లాడుతూ తన సేవలను గుర్తించి అవార్డుకు ఎంపిక చేసిన అధికారులకు, తనను అభినందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.