BREAKING
రేపు నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును కలిసిన ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి బద్వేల్ రూరల్ ఇన్‌చార్జ్‌గా ఏఎంసీ చైర్మన్ యారవ రమాశ్రీనివాస్ చేతికొచ్చిన వరి పంట ఎండిపోతున్న పట్టించుకోరా….? 31వ వార్డులో సంక్షేమ సంబరం అర్జీ పరిష్కారంపై ప్రజల అభిప్రాయమే ప్రామాణికం-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా భారతీయ సినిమాకు తీరని లోటు — నందమూరి బాలకృష్ణ పేద విద్యార్థికి లయన్స్ క్లబ్ చేయూత సింగీతం శ్రీనివాసరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలి ఇంధన సంక్షోభం: 10 కోట్ల బ్యారెళ్ల అత్యవసర నిల్వలు విడుదల చేయనున్న జీ7 దేశాలు కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు ఘన స్వాగతం. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం విజయవాడ ఇంద్రకీలాద్రిపై వీఐపీ దర్శనాలు రద్దు: భారీగా పెరిగిన భక్తుల రద్దీ టీడీపీ బలోపేతమే లక్ష్యం. సమన్వయంతో ముందుకు సాగాలి

ఎదులాపురం చెరువు వాగుపై కబ్జా బాగోతమా?

Select Suryaa Now
ఎదులాపురం చెరువు వాగుపై కబ్జా బాగోతమా?


*బఫర్‌జోన్‌ హద్దులు తేలకముందే నిర్మాణాలు.. అధికారుల అనుమతులపై తీవ్ర అనుమానాలు
*ఛార్జింగ్‌ స్టేషన్‌కు పర్మిషన్‌, ఎన్‌ఓసీ ఉందంటున్న నిర్వాహకులు.. కాలువ హద్దులపై స్పష్టత ఏది?
ఖమ్మం రూరల్‌ సూర్య మేజర్ న్యూస్ : ఎదులాపురం చెరువు నుంచి వచ్చే వరద నీటి ప్రవాహానికి కీలకమైన వాగు, బఫర్‌జోన్‌ ప్రాంతంలో నిర్మాణాలు చేపడుతున్నారంటూ స్థానికులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. వరంగల్‌ క్రాస్‌ రోడ్‌ సమీపంలోని ప్రధాన రహదారిపై ఉన్న ఈ ప్రాంతంలో నిర్మాణాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఛార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేసేందుకు అనుమతులు తీసుకున్నామని, సంబంధిత ఎన్‌ఓసీ కూడా పొందామని నిర్వాహకులు చెబుతున్నప్పటికీ.. అసలు నిర్మాణం జరుగుతున్న ప్రదేశం చెరువు వాగు పరిధిలో ఉందా? బఫర్‌జోన్‌లోకి వస్తుందా? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.
ముఖ్యంగా బఫర్‌జోన్‌ హద్దులను అధికారికంగా నిర్ధారించారా? కాలువకు ఇరువైపులా ఎంత మేర స్థలం ఉంది? వాగు అసలు వెడల్పు ఎంత? నిర్మాణానికి ముందు సంబంధిత శాఖలు క్షేత్రస్థాయిలో సర్వే చేశాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హద్దులు, కాలువ వెడల్పు స్పష్టంగా నిర్ధారించకుండానే నిర్మాణాలు కొనసాగితే భవిష్యత్‌లో వర్షాకాలంలో నీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాన రహదారిపై నిర్మాణాలు.. అధికారుల నిఘా ఎక్కడ?
వరంగల్‌ క్రాస్‌ రోడ్‌ సమీపంలో, ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ప్రాంతంలో నిర్మాణ పనులు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు ముందస్తు తనిఖీలు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుమతులు ఉన్నాయా? ఉంటే ఏ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు మంజూరయ్యాయి? ఎన్‌ఓసీ ఏ నిబంధనల ఆధారంగా ఇచ్చారు? నిర్మాణ ప్రాంతం బఫర్‌జోన్‌కు బయటే ఉందా? అనే అంశాలను అధికారులు ప్రజలకు స్పష్టంగా వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.
చెరువు వాగులు, వరద నీటి ప్రవాహ మార్గాలను కాపాడాల్సిన అధికారులు నిర్మాణాలు జరుగుతున్న సమయంలోనే స్పందించాలని.. కబ్జా ఆరోపణలపై సమగ్ర సర్వే నిర్వహించి హద్దులను నిర్ధారించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు ఉన్నట్లు తేలితే ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
వాగు భూమి కబ్జాకు గురైందా? లేక అనుమతుల పరిధిలోనే నిర్మాణం జరుగుతోందా? అన్నది అధికారుల క్షేత్రస్థాయి పరిశీలనతోనే తేలాల్సి ఉంది. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు స్పందించి బఫర్‌జోన్‌, కాలువ హద్దులను స్పష్టంగా గుర్తించి ప్రజల్లో నెలకొన్న అనుమానాలకు తెరదించాలని స్థానికులు కోరుతున్నారు.