BREAKING
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు బీఎంఆర్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన పలువురు బిఆర్ఎస్ నాయకులు నింబగల్లు ఎస్‌ఎస్‌ ట్యాంకుకు గండి.. తుంగభద్ర జలాలు వృథా ఉత్తమ గ్రంథపాలకుడిగా నాసిక శివాజీకి పురస్కారం రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో జగ్గయ్యపేట యువతికి బంగారు పతకం.సీనియర్ మహిళల 47 కేజీల విభాగంలో ప్రథమ స్థానం సాధించిన వేమవరపు రత్నకుమారి బాపట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కావూరి శ్రీనివాస రెడ్డి పరామర్శ వైఎస్ఆర్సిపి పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. మున్సిపల్ ఇంచార్జ్ వైయస్ మనోహర్ రెడ్డి పేద విద్యార్ధి ఉన్నత చదువులకు ఆర్థిక చేయుత. ఆధునిక సాగు విధానాలపై రైతులకు మార్గదర్శనం :జిల్లా డైరెక్టర్ పత్తి దత్తుడు దసరా శరన్నవరాత్రుల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన కాళికామాత ఆలయ కమిటీ ప్రాణాలు పోతేనే పట్టించుకుంటారా రేణిగుంటలో అదృశ్యమైన ఇద్దరు బాలులు మహబూబ్ నగర్ ప్రత్యక్షమయ్యారు. మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ పై హర్షం నేషనల్ పార్క్ పూర్వవైభవానికి 31 రోజుల కార్యాచరణ చీరాలలో పోలీసులు విస్తృత తనిఖీలు

బద్వేల్ రూరల్ ఇన్‌చార్జ్‌గా ఏఎంసీ చైర్మన్ యారవ రమాశ్రీనివాస్

Select Suryaa Now
బద్వేల్ రూరల్ ఇన్‌చార్జ్‌గా ఏఎంసీ చైర్మన్  యారవ రమాశ్రీనివాస్

పామూరు, మేజర్ న్యూస్ :

కూటమి ప్రభుత్వ అధికారిక పులింవెందుల పర్యటన, పల్లె పండుగ ప్రగతి సమీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. కనిగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యారవ రమాశ్రీనివాస్‌ను బద్వేల్ నియోజకవర్గ రూరల్ ఇన్‌చార్జ్‌గా నియమించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్టోబర్‌ 5న పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పులివెందుల పర్యటనకు సంబంధించిన క్షేత్రస్థాయి ఏర్పాట్లతో పాటు పల్లె పండుగ ప్రగతి సమీక్ష కార్యక్రమం విజయవంతానికి అవసరమైన ఏర్పాట్లను సమన్వయం చేసే పూర్తి బాధ్యతలను యారవ రమాశ్రీనివాస్‌కు పార్టీ అధిష్టానం అప్పగించింది. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ పర్యటనను విజయవంతం చేసేందుకు ఆయన కృషి చేయనున్నారు. పార్టీ అధిష్టానం తనపై ఉంచిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు ముందుకు సాగనున్నారు.