ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును కలిసిన ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు
అనంతపురం బ్యూరో : కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా కలిశారు. కళ్యాణదుర్గంలోని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు స్వగృహంలో ఈ భేటీ జరిగింది.
ఈ సందర్భంగా ఇరువురు నేతలు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యేకంగా చర్చించినట్లు తెలిసింది. ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, స్థానికంగా అనుసరించాల్సిన వ్యూహాలపై వారు చర్చించినట్లు సమాచారం.
కూటమి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఇరువురు నేతల భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.