పట్టపగలే దర్జాగా దొంగతనం
ఉండి, మేజర్ న్యూస్: మండల కేంద్రమైన ఉండి గ్రామంలో ఆకివీడు వెళ్లే రోడ్లో పెద ఆంజనేయస్వామి విగ్రహం ఎదురుగా ఉన్న కోడిగుడ్ల షాపులో పట్టపగలే దొంగ దర్జాగా చోరీ చేసిన సంఘటన సీసీటీవీలో రికార్డ్ అయిన సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది ఇందుకు సంబంధించి షాపు యజమాని కొనగళ్ళ విశ్వేశ్వరరావు మరియు స్థానికులు అందించిన సమాచారం మేరకు ఉదయం షాపు తెరిచి పక్కనే ఉన్న మరొక షాపును శుభ్రం చేస్తుండగా అలికిడి అయ్యింది అనిపించి వచ్చి చూడగా ఎవరూ కనిపించలేదని అనుమానం వచ్చి సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించగా అందులో దొంగ కోడిగుడ్లు ఉన్న షాపులోని కౌంటర్ నుండి దాదాపు 15 వేల రూపాయలు నగదును తీసుకువెళ్లడం జరిగిందని ఆయన అన్నారు. వెంటనే దొంగ కోసం తాను తన కుమారుడు స్థానికులు కలిసి పరిసరాల్లో వెదకడం జరిగిందని దొంగ కనిపించకపోవడంతో వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వడం జరిగిందని అనంతరం ఫిర్యాదు కూడా చేసినట్లు ఆయన తెలిపారు. పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో పట్టపగలు దొంగతనం జరగడం పట్ల స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
ఉండి రిపోర్టర్ రాజు