BREAKING
బాక్సాఫీస్ వద్ద టామ్ క్రూజ్ సరికొత్త రికార్డు: భారీ పరాభవాన్ని చవిచూసిన డిగ్గర్ సినిమా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు బీఎంఆర్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన పలువురు బిఆర్ఎస్ నాయకులు నింబగల్లు ఎస్‌ఎస్‌ ట్యాంకుకు గండి.. తుంగభద్ర జలాలు వృథా ఉత్తమ గ్రంథపాలకుడిగా నాసిక శివాజీకి పురస్కారం రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో జగ్గయ్యపేట యువతికి బంగారు పతకం.సీనియర్ మహిళల 47 కేజీల విభాగంలో ప్రథమ స్థానం సాధించిన వేమవరపు రత్నకుమారి బాపట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కావూరి శ్రీనివాస రెడ్డి పరామర్శ వైఎస్ఆర్సిపి పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. మున్సిపల్ ఇంచార్జ్ వైయస్ మనోహర్ రెడ్డి పేద విద్యార్ధి ఉన్నత చదువులకు ఆర్థిక చేయుత. ఆధునిక సాగు విధానాలపై రైతులకు మార్గదర్శనం :జిల్లా డైరెక్టర్ పత్తి దత్తుడు దసరా శరన్నవరాత్రుల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన కాళికామాత ఆలయ కమిటీ ప్రాణాలు పోతేనే పట్టించుకుంటారా రేణిగుంటలో అదృశ్యమైన ఇద్దరు బాలులు మహబూబ్ నగర్ ప్రత్యక్షమయ్యారు. మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ పై హర్షం నేషనల్ పార్క్ పూర్వవైభవానికి 31 రోజుల కార్యాచరణ

అర్జీ పరిష్కారంపై ప్రజల అభిప్రాయమే ప్రామాణికం-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

Select Suryaa Now
అర్జీ పరిష్కారంపై ప్రజల అభిప్రాయమే ప్రామాణికం-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

-QR కోడ్ ద్వారా ఫీడ్‌బ్యాక్ నమోదు తప్పనిసరి
-అసంతృప్తి వ్యక్తమైన అర్జీలపై ప్రత్యేక పునఃపరిశీలన

నంద్యాల బ్యూరో:ప్రజా సమస్యల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనానికి పెద్దపీట వేస్తూ, అధికారులు అందించిన పరిష్కారాలపై అర్జీదారుల వాస్తవ అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన QR కోడ్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ విధానాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ద్వారా సమర్పించిన అర్జీలపై అధికారులు తీసుకున్న చర్యల పట్ల అర్జీదారులు ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారో నేరుగా తెలుసుకునేందుకు ఈ విధానం దోహదపడుతుందని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో కలెక్టర్ తెలిపారు. ఫీడ్‌బ్యాక్ నమోదు ఇలా చేయాలి: అర్జీ పరిష్కారమైనట్లు సమాచారం అందిన అనంతరం, సంబంధిత రసీదు లేదా సందేశంలో ఉన్న QR కోడ్‌ను స్మార్ట్‌ఫోన్‌తో స్కాన్ చేసి, పరిష్కారంపై తమ సంతృప్తి లేదా అసంతృప్తిని అర్జీదారులు నమోదు చేయాలి. ప్రజల నుంచి అందే అభిప్రాయాల ఆధారంగా పరిష్కారాల నాణ్యతను అంచనా వేసేందుకు, అధికారుల పనితీరును మెరుగుపరిచేందుకు అవకాశం కలుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు

*అసంతృప్తి వ్యక్తమైన అర్జీలపై ప్రత్యేక దృష్టి* 

అధికారులు అందించిన పరిష్కారంపై అర్జీదారులు అసంతృప్తి వ్యక్తం చేసిన పక్షంలో, సంబంధిత అర్జీలను ఉన్నతాధికారులు ప్రత్యేకంగా సమీక్షిస్తారు. అవసరమైన సందర్భాల్లో క్షేత్రస్థాయిలో సమస్యను పునఃపరిశీలించి, అర్జీదారులకు తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటారు. అధికారుల జవాబుదారీతనానికి ప్రాధాన్యం: ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యం వంటి అంశాలను గుర్తించడంతో పాటు, ప్రభుత్వ సేవల నాణ్యతను నిరంతరం మెరుగుపరిచేందుకు ప్రజల ఫీడ్‌బ్యాక్ కీలకంగా నిలుస్తుందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని అర్జీదారులందరూ తమ సమస్య పరిష్కారమైన అనంతరం QR కోడ్ ద్వారా తప్పనిసరిగా వాస్తవ అభిప్రాయాన్ని నమోదు చేసి, ప్రజలకు జవాబుదారీగా ఉండే పారదర్శక పాలనను బలోపేతం చేసేందుకు సహకరించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి కోరారు.