రేపు నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
-ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారమే లక్ష్యం
నంద్యాల బ్యూరో:జిల్లా ప్రజల సమస్యలను సత్వరంగా పరిష్కరించేందుకు ఈ నెల 05వ తేదీ సోమవారం జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌తో పాటు రెవెన్యూ డివిజన్, మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల్లో ఉదయం 10 గంటల నుంచి ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. సంబంధిత అధికారులు వినతులను పరిశీలించి, నిబంధనల మేరకు సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను meekosam.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేసుకోవచ్చని, అర్జీల పరిష్కార స్థితిని టోల్‌ఫ్రీ నంబర్ 1100 ద్వారా తెలుసుకోవచ్చని వివరించారు. ముందుగా మండల, రెవెన్యూ డివిజన్ లేదా మున్సిపల్ స్థాయిలో సమస్యలను పరిష్కరించుకోవాలని, అక్కడ పరిష్కారం కాని సమస్యలను జిల్లా స్థాయి PGRSలో సమర్పించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా కేంద్రంలోని కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజల వినతులను స్వీకరించాలని ఆదేశించారు.