BREAKING
చమర్తి ఆధ్వర్యంలో మదనపల్లికి తరలి వెళ్లిన తెలుగు రాజంపేట తమ్ముళ్లు, రైతులు అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొట్టేందుకేనా హెచ్-1బి వీసాలు? జేడీ వాన్స్ స్ట్రాంగ్ వార్నింగ్.. శ్రీరంగవరంలో ఘనంగా గ్యార్వీ పండుగ వరద బాధితులు గూడు కోసం 17 ఏళ్ల నిరీక్షణ..!! పల్లె పండుగతో అభివృద్ధి పరుగులు రెమ్యునరేషన్ కోసమే అయితే ముప్పై, నలభై సినిమాలు చేసేదాన్ని: నటి శ్రీనిధి శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు! యూరప్‌పై దాడి చేసే ఉద్దేశం లేదు.. కానీ’: నాటోకు వ్లాదిమిర్ పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్.. గాంధీ విగ్రహానికి పాలాభిషేకం రజినీకాంత్ బయోగ్రఫీలో ఆ స్టార్ హీరో: ఆసక్తికర విషయం వెల్లడించిన సౌందర్య! ఎంపీ అవినాష్‌రెడ్డికి ఈడీ నోటీసులు విభిన్న కథాంశంతో వస్తున్న 'టాల్కమ్ పౌడర్' సినిమా.. నవంబర్ 13న థియేటర్లలోకి! పెన్షన్ లబ్దిదారులలో వెల్లి విరుస్తున్న ఆనందం ఫాహద్ ఫాజిల్ 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' సినిమా రివ్యూ.. ఆకట్టుకునేలా ఉందా? వైవిధ్యమైన కథాంశంతో వస్తున్న డోరతీ సినిమా రివ్యూ.. కీర్తి సురేష్ కీలక పాత్రలో ఎలా ఉందంటే! ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయాణికుడి యత్నం..శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో హై టెన్షన్‌:

హైదరాబాద్ నగర ప్రయాణికులకు బిగ్ అప్‌డేట్

Select Suryaa Now
హైదరాబాద్ నగర ప్రయాణికులకు బిగ్ అప్‌డేట్

హైదరాబాద్, సూర్య ప్రధాన ప్రతినిధి :భాగ్యనగర వాసుల ప్రయాణాలను మరింత సులభతరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. హైదరాబాద్‌లోని మెట్రో రైళ్లు మరియు ఆర్టీసీ సిటీ బస్సుల్లో ప్రయాణించేందుకు వీలుగా ఉమ్మడి కామన్ పాస్ 'మీ టికెట్' సౌకర్యాన్ని నేటి నుంచి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులతో కలిసి ఈ నూతన రవాణా పాస్‌లను అధికారికంగా ప్రారంభించనున్నారు.

ఈ పథకం కింద రోజువారీ మరియు నెలవారీ ప్రాతిపదికన కామన్ పాస్‌లను నిర్ణయించారు. రోజువారీ కామన్ పాస్ ధరను మెట్రో రవాణాకు రూ.300, ఆర్టీసీ ప్రయాణానికి రూ.100 చొప్పున మొత్తం రూ.400గా ఖరారు చేశారు. అలాగే ప్రతి నెలా క్రమం తప్పకుండా ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థుల కోసం నెలవారీ కామన్ పాస్ ధరను మెట్రో వాటా రూ.7,000, ఆర్టీసీ వాటా రూ.1,500 కలిపి మొత్తం రూ.8,500గా నిర్ణయించారు. ఒకే పాస్‌తో రెండు ప్రముఖ రవాణా వ్యవస్థల్లో ప్రయాణించే వెసులుబాటు కలగడంతో ప్రయాణికుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.