BREAKING
ఉమ్మడి కర్నూలు జిల్లాలో కరూర్ మండల ప్రకటన చమర్తి ఆధ్వర్యంలో మదనపల్లికి తరలి వెళ్లిన తెలుగు రాజంపేట తమ్ముళ్లు, రైతులు అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొట్టేందుకేనా హెచ్-1బి వీసాలు? జేడీ వాన్స్ స్ట్రాంగ్ వార్నింగ్.. శ్రీరంగవరంలో ఘనంగా గ్యార్వీ పండుగ వరద బాధితులు గూడు కోసం 17 ఏళ్ల నిరీక్షణ..!! పల్లె పండుగతో అభివృద్ధి పరుగులు రెమ్యునరేషన్ కోసమే అయితే ముప్పై, నలభై సినిమాలు చేసేదాన్ని: నటి శ్రీనిధి శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు! యూరప్‌పై దాడి చేసే ఉద్దేశం లేదు.. కానీ’: నాటోకు వ్లాదిమిర్ పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్.. గాంధీ విగ్రహానికి పాలాభిషేకం రజినీకాంత్ బయోగ్రఫీలో ఆ స్టార్ హీరో: ఆసక్తికర విషయం వెల్లడించిన సౌందర్య! ఎంపీ అవినాష్‌రెడ్డికి ఈడీ నోటీసులు విభిన్న కథాంశంతో వస్తున్న 'టాల్కమ్ పౌడర్' సినిమా.. నవంబర్ 13న థియేటర్లలోకి! పెన్షన్ లబ్దిదారులలో వెల్లి విరుస్తున్న ఆనందం ఫాహద్ ఫాజిల్ 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' సినిమా రివ్యూ.. ఆకట్టుకునేలా ఉందా? వైవిధ్యమైన కథాంశంతో వస్తున్న డోరతీ సినిమా రివ్యూ.. కీర్తి సురేష్ కీలక పాత్రలో ఎలా ఉందంటే!

మంచి వాళ్ళ గుండెల్లో మహాత్ముడు చిరస్మరణీయుడే...

Select Suryaa Now
మంచి వాళ్ళ గుండెల్లో మహాత్ముడు చిరస్మరణీయుడే...

 

*నవసమాజ స్థాపనకు కృషి చేద్దాం: ఎమ్మెల్యే*

*షాద్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

మంచి వాళ్ళ గుండెల్లో మహాత్ముడు గాంధీజీ ఎప్పుడు చిరస్మరణీయంగా ఉంటారని, ఉన్మాదుల విమర్శలు ఆయనను ఏమీ చేయలేవని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.షాద్ నగర్ పట్టణంలో మండల పరిషత్ ముందు మహాత్మా గాంధీ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో అందరినీ ముందుకు నడిపి స్వాతంత్రాన్ని సిద్ధింప చేసిన మహనీయుడు మహాత్మా గాంధీ అని అన్నారు. కాంగ్రెస్ నాటి నుంచి నేటి దాకా ఆయన మార్గంలోనే పయనిస్తుందని వెల్లడించారు. పండిత్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఇలాంటి వాళ్లు గాంధీ ఆశయ సాధన కోసమే కృషి చేశారని గుర్తించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి తన వరకు ప్రతి ఒక్కరం గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేసి గాంధీ కలలు కన్న స్వరాజ్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ మహాత్ముడి ఆశయాల మార్గంలో ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు బసవేశ్వర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్ ,కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం రాష్ట్ర కో ఆర్డినేటర్  రఘు నాయక్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పి వెంకట్ రాంరెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్,పట్టణ అధ్యక్షులు నల్లమోని శ్రీధర్, సీనియర్ నేత దంగు శ్రీనివాస్ యాదవ్,కౌన్సిలర్లు  మురళి మోహన్ ఆప్పి,బచ్చలి నరేష్, కొప్పునూర్ ప్రవీణ్, దిలీప్ కుమార్,గ్రంధాలయం చైర్మెన్ మధన్ మోహన్ రెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ తుపాకుల శేఖర్,మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఖదీర్,కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇబ్రహీం, రిటైర్డ్  ఎంఆర్వో సరపు జగదీశ్వర్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరణకర్, కాంగ్రెస్ సీనియర్ నేత బాధేపల్లి సిద్దార్థ, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు శివ కుమార్ మండల కాంగ్రెస్ అధికార ప్రతినిధి కరోల్ల యాదయ్య, లింగారెడ్డి గూడ ఉప సర్పంచ్ ఎరోల్లా అశోక్, కాంగ్రెస్ నేతలు జామాల్ పూర్ చందూలాల్, ముబరాక్, గోధ మాధవులు యాదవ్, రవితేజ చిన్న,కత్తి చంద్ర శేఖర్, బీరప్ప, విరేశ్,మంగ అశోక్, మేకల వెంకటేష్, నిరాటి వాసు,జంగయ్య , గడ్డం జంగయ్య, గంగన మొని సత్యయ్య, సీతారాం, మహబూబ్, మహేందర్, శేఖర్,పట్టణ కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ అభిమానులు పాల్గొన్నారు.

జవాజి రాఘవేంద్ర గౌడ్ : మేజర్ న్యూస్ షాద్ నగర్