చమర్తి ఆధ్వర్యంలో మదనపల్లికి తరలి వెళ్లిన తెలుగు రాజంపేట తమ్ముళ్లు, రైతులు
చమర్తి ఆధ్వర్యంలో హార్టికల్చర్ హబ్ ప్రారంభోత్సవానికి తరలి వెళ్లిన రాజంపేట నియోజకవర్గ రైతులు మరియు నాయకులు
రాజంపేట:
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జరుగుతున్న హార్టికల్చర్ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాజంపేట నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో రైతులు, నాయకులు తరలివెళ్లారు.రాజంపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు ఆధ్వర్యంలో నియోజకవర్గం నుంచి మొత్తం 13 బస్సులు, 25 కార్లలో సుమారు 600 మందికి పైగా రైతులు, నాయకులు మదనపల్లెలోని సభా ప్రాంగణానికి చేరుకున్నారు.