BREAKING
చమర్తి ఆధ్వర్యంలో మదనపల్లికి తరలి వెళ్లిన తెలుగు రాజంపేట తమ్ముళ్లు, రైతులు అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొట్టేందుకేనా హెచ్-1బి వీసాలు? జేడీ వాన్స్ స్ట్రాంగ్ వార్నింగ్.. శ్రీరంగవరంలో ఘనంగా గ్యార్వీ పండుగ వరద బాధితులు గూడు కోసం 17 ఏళ్ల నిరీక్షణ..!! పల్లె పండుగతో అభివృద్ధి పరుగులు రెమ్యునరేషన్ కోసమే అయితే ముప్పై, నలభై సినిమాలు చేసేదాన్ని: నటి శ్రీనిధి శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు! యూరప్‌పై దాడి చేసే ఉద్దేశం లేదు.. కానీ’: నాటోకు వ్లాదిమిర్ పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్.. గాంధీ విగ్రహానికి పాలాభిషేకం రజినీకాంత్ బయోగ్రఫీలో ఆ స్టార్ హీరో: ఆసక్తికర విషయం వెల్లడించిన సౌందర్య! ఎంపీ అవినాష్‌రెడ్డికి ఈడీ నోటీసులు విభిన్న కథాంశంతో వస్తున్న 'టాల్కమ్ పౌడర్' సినిమా.. నవంబర్ 13న థియేటర్లలోకి! పెన్షన్ లబ్దిదారులలో వెల్లి విరుస్తున్న ఆనందం ఫాహద్ ఫాజిల్ 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' సినిమా రివ్యూ.. ఆకట్టుకునేలా ఉందా? వైవిధ్యమైన కథాంశంతో వస్తున్న డోరతీ సినిమా రివ్యూ.. కీర్తి సురేష్ కీలక పాత్రలో ఎలా ఉందంటే! ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయాణికుడి యత్నం..శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో హై టెన్షన్‌:

ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయాణికుడి యత్నం..శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో హై టెన్షన్‌:

Select Suryaa Now
ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయాణికుడి యత్నం..శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో హై టెన్షన్‌:

హైదరాబాద్, సూర్య ప్రధాన ప్రతినిధి శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (RGIA) ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌‌ నుంచి కడపకు బయలుదేరేందుకు సిద్ధమవుతున్న విమానంలో ఓ ప్రయాణికుడు తీవ్ర వీరంగం సృష్టించాడు. విమానం టేకాఫ్‌ అవుతున్న సమయంలో ఆ వ్యక్తి ఉన్నట్టుండి ఎమర్జెన్సీ డోర్‌ను తెరిచేందుకు ప్రయత్నించాడు.

దీంతో ప్రమాదాన్ని గ్రహించిన విమాన సిబ్బంది వెంటనే తీవ్రంగా అప్రమత్తమై ఆ వ్యక్తిని అడ్డుకున్నారు. ఒక్కసారిగా చోటుచేసుకున్న ఈ అనూహ్య పరిణామంతో విమానంలో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సిబ్బంది వెంటనే ఆ ప్రయాణికుడిని తమ అదుపులోకి తీసుకుని, ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, సదరు వ్యక్తి అలా ఎందుకు ప్రవర్తించాడనే కోణంలో విచారణ జరుపుతున్నారు.