పెన్షన్ లబ్దిదారులలో వెల్లి విరుస్తున్న ఆనందం
- గజపతినగరంలో డిబిటి పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం
- రాష్ట్రవ్యాప్తంగా 2,692.34 కోట్లు మంజూరు
- పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ
- 2 నెలలుగా పెన్షన్ తీసుకొని 156.21 కోట్లు బకాయిలు విడుదల
మంత్రి కొండపల్లి శ్రీనివాస్
గజపతినగరం, సూర్య ప్రతినిధి : కూటమి ప్రభుత్వ అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లుతో లబ్ధిదారుల్లో ఆనందం వెల్లి విరుస్తుందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం విజయనగరం జిల్లా గజపతినగరం తానా వీధిలో కేంద్ర ఆదేశాల మేరకు స్నా స్పార్స్ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాల్లో పింఛన్ జమ చేసే విధానాన్ని పైలట్ ప్రాతిపదిక పెన్షన్లను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కొత్త విధానం కింద గజపతినగరం మండలంలోని పింఛనుదారుల ఖాతాల్లో నేరుగా రు. 6 లక్షలు జమ చేయటం జరిగిందన్నారు. ఈ డి.బి.టి చెల్లింపు నిబంధన కేవలం ఎన్. ఎస్. ఏ.పి పరిధిలోని 1919 మంది పింఛనుదారులకు మాత్రమే వర్తిస్తుందనీ, మిగిలిన 6,138,529 లక్షల మంది ఎన్టీఆర్ భరోసా పింఛనుదారులకు యథావిధిగా ఇంటి వద్దే నగదు రూపంలో పింఛన్ అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ నెల పింఛన్ల పంపిణీ కోసం రూ.2,692.34 కోట్లను ప్రభుత్వం విడుదల చేయటం జరిగిందన్నారు. అక్టోబర్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 61,40,448 లక్షల మంది పింఛనుదారులకు లబ్ధి చేకూరుతుందన్నారు. పంపిణీ చేసే నిధుల్లో రూ.2,675.63 కోట్లను సంబంధిత స్వర్ణ గ్రామం/స్వర్ణ వార్డు పింఛను బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. తాత్కాలిక వలసల వల్ల ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పింఛను తీసుకోలేని వారికి బకాయిలతో కలిపి రూ.156.21 కోట్లు విడుదల చేసామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు పింఛన్ల కోసం రూ.76,199.38 కోట్ల రూపాయలు అందజేశామని, 2026–27 ఆర్థిక సంవత్సరానికి గానూ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.33,485.10 కోట్లను కేటాయించడం జరిగిందన్నారు. గజపతినగరం మండలంలో 8, 096 మందికి పెన్షన్లు అందజేసినట్లు తెలిపారు. వృద్ధులు, వికలాంగుల, సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పెన్షన్ అందించడంతో ఆదుకోవడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి పొలిట్ బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి, ఏ.ఎం.సీ చైర్మన్ పి వి వి గోపాలరాజు, మాజీ జడ్పిటిసి సభ్యులు మక్కువ శ్రీధర్ గారు, ప్రదీప్ గారు డిఆర్డిఏ పిడి శ్రీనివాస ఫణి తదితరులు పాల్గొన్నారు.