BREAKING
బాపూజీ, శాస్త్రిజీల ఆదర్శాలు నిత్య స్మరణీయం: మంత్రి నారా లోకేష్ గాంధీజీ ఆశయాలే భావితరాలకు మార్గదర్శకం:రాకేష్ రెడ్డి గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన ఏపీయూడబ్ల్యూజె ప్రతినిధులు మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకోవాలి గాంధీజీ ఆశయసాధనకు అందరూ కృషి చేయాలి. ఎస్సై ఎం హేమలత. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికే గ్రామ సభలు.... అధికారులు. తిరుమల శ్రీవారికి నిత్యం 45 రకాల నైవేద్యాలు: మిర్చి లేకుండా మిరియాలతోనే వైఖానస ఆగమ ప్రసాదాల రహస్యం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన జూలియన్ రాజు ఢిల్లీలో 11 మెట్రో స్టేషన్లు మూసివేత, జంతర్ మంతర్ వద్ద భారీ బందోబస్తు: సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోసం సీజేపీ ఆందోళన కదిరిలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు దేవాదుల, ,ఎస్సారెస్పీ నీళ్ల కోసం ఎర్రబెల్లి విజ్ఞప్తి వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా మహాత్మాగాంధీ జయంతి వేడుకలు సెలవుకు 'నో ఎంట్రీ'.. శ్రీ చైతన్య స్కూల్ డ్యూటీ! గాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి *మహాత్మా గాంధీ ఆశయాలు శిరోధార్యం* *జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి*

గాంధీజీ ఆశయ సాధనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు

Select Suryaa Now
గాంధీజీ ఆశయ సాధనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు

 

విజయనగరం (అక్టోబర్ 2), మేజర్ న్యూస్:

జాతిపిత మహాత్మా గాంధీజీ 157వ జయంతి సందర్భంగా విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పార్టీ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ... "గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు" అన్న గాంధీజీ ఆశయాల సాధనకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న ప్రస్తుత ప్రభుత్వానికి ప్రజలందరూ పూర్తి స్థాయిలో అండగా నిలవాలని ఆమె పిలుపునిచ్చారు.

సింహాచలం సత్రానికి రూ.1.60 కోట్ల నిధులు మంజూరు:

విజయనగరం పట్టణంలో 1933 నుంచి సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి సత్రంలో నూతన డైనింగ్ హాల్, కిచెన్ నిర్మాణాల కోసం సింహాచలం దేవస్థానం నుంచి రూ. 1.60 కోట్లు మంజూరు కావడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఈ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించిన సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్, గోవా రాష్ట్ర గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజుకు, అలాగే దేవస్థానం ఈవోకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.