ఎంపీ అవినాష్‌రెడ్డికి ఈడీ నోటీసులు
హైదరాబాద్, సూర్య ప్రధాన ప్రతినిధి :మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్‌ఆర్‌సీపీ కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 14వ తేదీన విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశాల్లో పేర్కొంది.
వివేకా హత్య కేసులో జరిగిన దాదాపు రూ. 40 కోట్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల కోణంలో ఈడీ తీవ్రస్థాయిలో దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే కేసులో నిందితులుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డిలతో పాటు అప్రూవర్‌గా మారిన దస్తగిరిని ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. నిందితుల నుంచి సేకరించిన సమాచారం మరియు నగదు చలామణి ఆధారంగానే ఎంపీ అవినాష్‌రెడ్డికి నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో వివేకా హత్య కేసు విచారణ రాజకీయాస్పదంగా మళ్లీ వేడేక్కింది.