*మధిరలో ఘనంగా గర్భిణీలకు సీమంతాలు, అక్షరాభ్యాసాలు ...పోషకాహార ప్రాధాన్యతపై అవగాహన*
మధిర, సూర్య మేజర్ న్యూస్.
పోషణ మాసం సందర్భం మధిర ఐసిడిఎస్ పి.డీ.ఏ. ప్రమీల, సీడీపీఓ జి. కృష్ణశ్రీ ల ఆధ్వర్యంలో గర్భిణీలకు శ్రీమంతాలు పిల్లలకు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ సామ్యూల్ పాల్ డాక్టర్ పృద్వి, వెంకటేశ్వర్
ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పిడిఏ ప్రమీల మాట్లాడుతూ
తల్లులు గర్భిణీ దశ నుంచి బిడ్డ పుట్టే వరకు బిడ్డకు రెండు సంవత్సరాలు వచ్చేవరకు వేయి రోజులు తీసుకోవలసిన జాగ్రత్తలు సూచించారు. తల్లులు ఇంట్లో చేయవలసిన పోషకాహార పద్ధతులు, కిశోర బాలికలు తీసుకోవలసిన ఆహారం, ఆ వయసులో పాటించాల్సిన జాగ్రత్తలు తెలియజేసారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ కృష్ణ శ్రీ మాట్లాడుతూ తల్లులు కచ్చితంగా అదనపు ఆహారం తీసుకోవాలని తక్కువ ఖర్చుతో తయారయ్యే ఇంటి ఆహార పదార్థాలను పిల్లలకు తినిపించాలని అన్నారు. బయట దొరికే జింక్ ఫుడ్స్ పిల్లలకు అనారోగ్యం కలిగిస్తాయని కాబట్టి అంగన్వాడీ కేంద్రాల్లో క్రమం తప్పకుండా పోషకాహారం తీసుకొని సేవలనువినియోగించుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు గర్భిణీ తో ఉన్న స్త్రీలు చిన్నపిల్లల తల్లులు పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.