ధర్మవరంలో ఘనంగా 'NTR భరోసా' పెన్షన్ల పంపిణీ ప్రతి అర్హుడికీ సంక్షేమం అందడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: హరీశ్ బాబు
ధర్మవరం:
ధర్మవరం పట్టణంలోని 28వ వార్డు (L4)లో 'NTR భరోసా' పెన్షన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ సూచనల మేరకు నియోజకవర్గ ఇంచార్జ్ హరీశ్ బాబు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ, పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు NTR భరోసా పథకం ఆర్థిక కొండంత అండగా నిలుస్తోందని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో 28వ వార్డు ఇంచార్జ్ పులకుంట మహేష్, బీజేపీ నాయకులు రమేష్, నరసింహులు, మహిళా నాయకురాలు శ్రీమతి మని తదితరులు పాల్గొన్నారు.