మీకోసం మేమున్నాం,,మంచి చేస్తాం,,మార్పు తీసుకు వస్తాం
మీకోసం మేమున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికి మంచి చేసి మళ్లీ మీ ముందుకు వస్తామని,మార్పు కోసం పేదల జీవితాలు సుఖంగా ఉండేందుకు నిత్యం తపించే ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు తెలియజేశారు. గురువారం రాజంపేట మున్సిపల్ పరిధిలోని మన్నూరు ప్రాంతంలో ఆయన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతమైన మాట్లాడుతూ సంక్షేమ పథకాలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు అందించడంలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని, ప్రజలకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పిస్తూనే, సంక్షేమ పథకాలు అందిస్తూనే సమస్య పరిష్కారంలో ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటామని, ప్రతి సమస్యను పరిష్కరించేందుకు సామరస్యంగా ముందుకు వెళ్దామని, రాజంపేట అభివృద్ధికి, నియోజకవర్గ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని, ప్రతి గ్రామం, వార్డులో తెలుగుదేశం నాయకులు ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి అధికార ప్రతినిధి దంతం శివప్రసాద్, ఇడమడకల కుమార్, స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.