పెన్షన్ పథకం కాదు బాధ్యత; పోలీ శివకుమార్
రాజంపేట:
పేదలు,వృద్ధులు,వితంతువులు మరియు దివ్యంగులకు అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని,పేదల సంక్షేమం మరియు సామాజిక భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని టిఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షులు పోలి శివకుమార్ పేర్కొన్నారు.
గురువారం నాడు రాజంపేట మండలం,పోలి గ్రామపంచాయతీ నందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "పేదల సేవలో" ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి హాజరై లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేయడమైనది.ఈ సందర్భంగా పోలి శివకుమార్ మాట్లాడుతూ దేశంలోనే అత్యధికంగా సామాజిక భద్రతా పింఛన్లు అందిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని తెలియజేస్తూ, పెన్షన్ మొత్తాన్ని ఏకంగా మూడు రెట్లు పెంచిన ఘనత ఒక్క నారా చంద్రబాబునాయుడు గారికే దక్కుతుందని పోలి శివకుమార్ తెలియజేశారు.