BREAKING
ఢిల్లీలో 11 మెట్రో స్టేషన్లు మూసివేత, జంతర్ మంతర్ వద్ద భారీ బందోబస్తు: సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోసం సీజేపీ ఆందోళన కదిరిలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు దేవాదుల, ,ఎస్సారెస్పీ నీళ్ల కోసం ఎర్రబెల్లి విజ్ఞప్తి వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా మహాత్మాగాంధీ జయంతి వేడుకలు సెలవుకు 'నో ఎంట్రీ'.. శ్రీ చైతన్య స్కూల్ డ్యూటీ! గాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి *మహాత్మా గాంధీ ఆశయాలు శిరోధార్యం* *జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి* మిజోరంలో ఘోర రోడ్డు ప్రమాదం: దూరదర్శన్, పీఐబీ అధికారుల దుర్మరణం.. మహాత్ముడికి ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్యే అమిలినేని గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం కోసం ప్రతి ఒక్కరు పాటు పడాలి పేదల సంక్షేమం.. గ్రామాల అభివృద్ధే లక్ష్యం డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ రివ్యూ: ఫాహద్ ఫాజిల్ తెలుగు ఎంట్రీ ఎలా ఉంది? ఆత్మతో సూరి ప్రయాణంలో నవ్వులెన్ని, నిరాశ ఎంత గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి - ఎమ్మెల్యే ప్రమాదపుటంచున పట్టణ దారుల్లో కలవర్ట్లు తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో అక్టోబర్ ఉత్సవాల సందడి: పార్థసారథి ఊరేగింపులు, వేదాంత దేశికర్ ఉత్సవం, పౌర్ణమి గరుడ సేవ పూర్తి వివరాలు

అర్హులైన ప్రతి కుటుంబానికి ఎన్టీఆర్ భరోసా : పనబాక లక్ష్మి

Select Suryaa Now
అర్హులైన ప్రతి కుటుంబానికి ఎన్టీఆర్ భరోసా : పనబాక లక్ష్మి

ఎన్టీఆర్ భరోసాతో అర్హులైన ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టిడిపి పార్లమెంటు అధ్యక్షురాలు, టిటిడి పాలక మండల సభ్యులు పనభాకలక్ష్మి తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా గురువారం తిరుమల బాలాజీ నగర్ లో లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆమెతోపాటు నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి, ఎస్వి బిసి చైర్మన్ శ్రీధర్ వర్మతో కలిసి అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందజేసి భరోసా కల్పించారు.ఈ సందర్భంగా పనబాక లక్ష్మి మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి ఎన్టీఆర్ భరోసా పింఛన్ తో పాటు అన్ని సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పింఛన్ల పంపిణీ సజావుగా జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు.అనంతరం లబ్ధిదారులను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో తిరుమల టిడిపి అధ్యక్షులు సుద్దాల రాజు యాదవ్, స్థానిక పార్టీ నాయకులు, వార్డు నాయకులు, కార్యకర్తలు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.