తాండూర్ ఎంసీహెచ్‌లో తల్లీబిడ్డ మృతి.. వైద్యుల నిర్లక్ష్యంపై ఫిర్యాదు
వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ భర్త ఫిర్యాదు.. కేసు నమోదు
యాలాల, మేజర్ న్యూస్:తాండూర్‌లోని ఎంసీహెచ్ ఆసుపత్రిలో ప్రసవ సమయంలో తల్లితో పాటు నవజాత శిశువు మృతి చెందిన ఘటనపై యాలాల పోలీసులకు ఫిర్యాదు చేశారు,జిన్గుర్తి గ్రామానికి చెందిన వడ్డే రాజు తండ్రి బాలప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.పోలీసుల వివరాల ప్రకారం..రాజు తన భార్య బాలమణిని ప్రసవం కోసం తాండూర్‌లోని ఎంసీహెచ్ ఆసుపత్రికి తీసుకువచ్చాడు.డెలివరీ సమయంలో పాపతో పాటు బాలమణి కూడా మృతి చెందినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తల్లీబిడ్డ మృతి చెందారని ఆరోపిస్తూ రాజు యాలాల పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ ఫిర్యాదు మేరకు యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.