BREAKING
అర్హులైన ప్రతి కుటుంబానికి ఎన్టీఆర్ భరోసా : పనబాక లక్ష్మి కరెంటు కోతలతో ఎండుతున్న వరి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ దివంగత లోక్‌సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి 75వ జయంతి: కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా పూజా కార్యక్రమాలు తాండూర్ ఎంసీహెచ్‌లో తల్లీబిడ్డ మృతి.. వైద్యుల నిర్లక్ష్యంపై ఫిర్యాదు శంకుస్థాపనకే పరిమితమైన ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌…! వరదవెల్లి గౌడ సంఘం నూతన కమిటీ ఎన్నిక. చంద్రశేఖర్‌కు తాడిపత్రి డీఎస్పీగా బదిలీ.... హాస్పిటల్ ఖర్చుకు గౌరవ వేతనం అందజేసిన దుపల్లి సర్పంచ్ ఎల్‌పీజీ సిలిండర్‌కు నేటి నుంచి కేవైసీ తప్పనిసరి మర్పల్లి పీఏసీఎస్ పీఠంపై తీవ్ర ఉత్కంఠ నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై నిర్ణయాలు! రేపల్లెలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన మంచిర్యాలలో దారుణ హత్య.. నిందితురాలి అరెస్ట్ ఆసుపత్రి సేవలను పరిశీలించిన హెల్త్‌కేర్ విద్యార్థులు

మర్పల్లి పీఏసీఎస్ పీఠంపై తీవ్ర ఉత్కంఠ

Select Suryaa Now
మర్పల్లి పీఏసీఎస్ పీఠంపై తీవ్ర ఉత్కంఠ

కొండల్‌రెడ్డి, రవీందర్ మధ్య నువ్వా.. నేనా..?

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి

మర్పల్లి, మేజర్ న్యూస్ (అక్టోబర్ 01): వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్ పదవిపై అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ వేడి పెరుగుతోంది. చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేయడంతో మర్పల్లి రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా గంధాలయ మాజీ చైర్మన్ ఎస్. కొండల్‌రెడ్డి, మర్పల్లి మండలానికి చెందిన యు. రవీందర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండటంతో పోటీ రసవత్తరంగా మారింది.
మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు..
పీఏసీఎస్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు కొండల్‌రెడ్డి తన రాజకీయ పరిచయాలు, పార్టీ నేతలతో ఉన్న సంబంధాలను ఉపయోగించుకుంటూ మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు యు. రవీందర్ సైతం తనకు అనుకూలంగా ఉన్న పీఏసీఎస్ డైరెక్టర్లను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇద్దరు నేతల అనుచరులు తమ తమ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.
డీసీసీబీ చైర్మన్ పదవిపైనా కన్ను..?
పీఏసీఎస్ చైర్మన్ పదవిని దక్కించుకున్న అనంతరం డీసీసీబీ చైర్మన్ పదవిని కూడా లక్ష్యంగా చేసుకుని కొండల్‌రెడ్డి ముందుకు సాగుతున్నారనే చర్చ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. పీఏసీఎస్ చైర్మన్ పదవే తదుపరి రాజకీయ సమీకరణాలకు కీలకంగా మారే అవకాశం ఉందని స్థానిక రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
స్పీకర్ రాకతో తేలనున్న సస్పెన్స్..
తెలంగాణ శాసనసభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ప్రస్తుతం యూఏఈ పర్యటనలో ఉన్న నేపథ్యంలో, ఆయన తిరిగి వచ్చిన అనంతరం మర్పల్లి పీఏసీఎస్ చైర్మన్ ఎవరికి ఇవ్వాలనే అంశంపై పార్టీ అధిష్ఠానం, స్థానిక నేతలతో చర్చించి నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో స్పీకర్ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత వెలువడే నిర్ణయంపైనే అందరి దృష్టి నెలకొంది.
ఎవరి వైపు డైరెక్టర్లు..?
పీఏసీఎస్ చైర్మన్ ఎన్నికలో స్థానిక డైరెక్టర్ల మద్దతు కీలకంగా మారనుంది. కొండల్‌రెడ్డి, రవీందర్ ఇద్దరూ తమకు అనుకూలంగా ఉన్న డైరెక్టర్ల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో చివరి వరకు ఉత్కంఠ కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ పెద్దల నిర్ణయం, డైరెక్టర్ల మద్దతు సమీకరణాలు, స్థానిక రాజకీయ పరిస్థితులు ఎవరికి అనుకూలంగా మారుతాయో వేచి చూడాల్సి ఉంది.మర్పల్లి పీఏసీఎస్ పీఠం కోసం ఇద్దరు నేతల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో కొండల్‌రెడ్డి లేదా రవీందర్.. చివరికి పీఏసీఎస్ చైర్మన్‌గా ఎవరు బాధ్యతలు చేపడతారనే అంశంపై మర్పల్లి మండలంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
 
రిపోర్టర్ రాములు.