BREAKING
ధర్మవరంలో ఘనంగా 'NTR భరోసా' పెన్షన్ల పంపిణీ ప్రతి అర్హుడికీ సంక్షేమం అందడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: హరీశ్ బాబు అర్హులైన ప్రతి కుటుంబానికి ఎన్టీఆర్ భరోసా : పనబాక లక్ష్మి కరెంటు కోతలతో ఎండుతున్న వరి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ దివంగత లోక్‌సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి 75వ జయంతి: కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా పూజా కార్యక్రమాలు తాండూర్ ఎంసీహెచ్‌లో తల్లీబిడ్డ మృతి.. వైద్యుల నిర్లక్ష్యంపై ఫిర్యాదు శంకుస్థాపనకే పరిమితమైన ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌…! వరదవెల్లి గౌడ సంఘం నూతన కమిటీ ఎన్నిక. చంద్రశేఖర్‌కు తాడిపత్రి డీఎస్పీగా బదిలీ.... హాస్పిటల్ ఖర్చుకు గౌరవ వేతనం అందజేసిన దుపల్లి సర్పంచ్ ఎల్‌పీజీ సిలిండర్‌కు నేటి నుంచి కేవైసీ తప్పనిసరి మర్పల్లి పీఏసీఎస్ పీఠంపై తీవ్ర ఉత్కంఠ నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై నిర్ణయాలు! రేపల్లెలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన మంచిర్యాలలో దారుణ హత్య.. నిందితురాలి అరెస్ట్

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై నిర్ణయాలు!

Select Suryaa Now
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై నిర్ణయాలు!

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గం నేడు సచివాలయంలో సమావేశం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. 

కేబినెట్ ముందున్న ప్రధాన అంశాలు

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌–2027 నిర్వహణపై చర్చ

హైదరాబాద్ మెట్రో మొదటి దశ స్వాధీనం, విలువ నిర్ధారణ, నిధుల సమీకరణపై సమాలోచన

మెట్రో రెండో దశ విస్తరణ, నిర్మాణ వ్యయంపై చర్చ

మూసీ నది పునరుజ్జీవన పథకం తదుపరి దశకు భూసేకరణపై నిర్ణయం

ప్రాంతీయ రింగ్ రోడ్డు నిర్మాణం, నిధులు, కేంద్ర అనుమతులపై చర్చ

ఉద్యోగులకు కరువు భత్యం, వేతన సవరణ సంఘం, పెండింగ్ బిల్లుల చెల్లింపులపై నిర్ణయాల అవకాశం

రాజీవ్ యువ వికాసం పథకం విధివిధానాలు, అమలు తేదీపై చర్చ

ఇందిరమ్మ చీరల పంపిణీ, సంక్షేమం, పరిపాలనకు సంబంధించిన ఇతర అంశాలపైనా చర్చించే అవకాశం ఉంది. 

హైదరాబాద్ మెట్రో మొదటి దశ స్వాధీనం, రెండో దశ విస్తరణకు సంబంధించి ఇప్పటికే కేంద్రంతో చర్చలు జరిగాయి. ఈ అంశాలపై సమగ్ర అధ్యయనం కోసం ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్‌ను సలహాదారుగా నియమించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. 

మూసీ పునరుజ్జీవనం, ప్రాంతీయ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ వంటి మౌలిక వసతుల అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి అనుమతులు, సహకారం కోరుతోంది.