ఎల్‌పీజీ సిలిండర్‌కు నేటి నుంచి కేవైసీ తప్పనిసరి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దేశీయ ఎల్‌పీజీ సిలిండర్లపై నేటి నుంచి కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. సబ్సిడీతో సిలిండర్ బుక్ చేసుకోవాలంటే ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ కేవైసీ తప్పనిసరి. ఇప్పటికే బయోమెట్రిక్ ధ్రువీకరణ పూర్తి చేసిన వినియోగదారులు మళ్లీ కేవైసీ చేయాల్సిన అవసరం లేదు.
కేవైసీ పూర్తి చేయని వినియోగదారులకు సబ్సిడీతో కూడిన ధరకు సిలిండర్ బుకింగ్ ధ్రువీకరణ పూర్తయ్యే వరకు అందుబాటులో ఉండదు. అయితే కేవైసీ చేయకపోయినా గ్యాస్ సిలిండర్ పొందే అవకాశం ఉంది.. కానీ సబ్సిడీ లేకుండా మార్కెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది.
కేవైసీ ఎలా చేయాలి?
సిలిండర్ డెలివరీ సమయంలో డెలివరీ సిబ్బంది ద్వారా
సంబంధిత గ్యాస్ ఏజెన్సీ కార్యాలయంలో
సంబంధిత చమురు సంస్థ అధికారిక మొబైల్ యాప్ ద్వారా
ఇండేన్ – ఇండియన్‌ఆయిల్ వన్
భారత్ గ్యాస్ – హలోబీపీసీఎల్
హెచ్‌పీ గ్యాస్ – హెచ్‌పీ పే
ప్రభుత్వం ప్రకారం సెప్టెంబర్ 19 నాటికి 27.43 కోట్ల మంది వినియోగదారులు ఇప్పటికే బయోమెట్రిక్ ఆధార్ ధ్రువీకరణ పూర్తి చేశారు.