మంచిర్యాలలో దారుణ హత్య.. నిందితురాలి అరెస్ట్
సూర్య, మంచిర్యాల జిల్లా ప్రతినిధి :అశోక్ రోడ్డులో మోహన్ అనే వ్యక్తి హత్యకు గురైన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో మృతుడి భార్య జమున (39), ఆమె కుమార్తెను నిందితులుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సీఐ ప్రమోద్ రావు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. మోహన్, జమున మధ్య కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నాయి. ఈ నెల 28న రాత్రి మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో జమున తన కుమార్తెతో కలిసి రోకలితో మోహన్ తలపై బలంగా కొట్టినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలతో మోహన్ మృతి చెందినట్లు వివరించారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం బుధవారం వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.