BREAKING
తాండూర్ ఎంసీహెచ్‌లో తల్లీబిడ్డ మృతి.. వైద్యుల నిర్లక్ష్యంపై ఫిర్యాదు శంకుస్థాపనకే పరిమితమైన ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌…! వరదవెల్లి గౌడ సంఘం నూతన కమిటీ ఎన్నిక. చంద్రశేఖర్‌కు తాడిపత్రి డీఎస్పీగా బదిలీ.... హాస్పిటల్ ఖర్చుకు గౌరవ వేతనం అందజేసిన దుపల్లి సర్పంచ్ ఎల్‌పీజీ సిలిండర్‌కు నేటి నుంచి కేవైసీ తప్పనిసరి మర్పల్లి పీఏసీఎస్ పీఠంపై తీవ్ర ఉత్కంఠ నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై నిర్ణయాలు! రేపల్లెలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన మంచిర్యాలలో దారుణ హత్య.. నిందితురాలి అరెస్ట్ ఆసుపత్రి సేవలను పరిశీలించిన హెల్త్‌కేర్ విద్యార్థులు దృశ్యం 3 పై అజయ్ దేవగన్ కీలక ప్రకటన.. మోహన్‌‌లాల్‌తో చర్చల గురించి అసలు నిజం ఏమిటి? విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపడమే గురువు అసలైన విజయం ఓటీటీలోకి కార్తీ సర్దార్ 2.. అనూహ్యంగా డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన స్పై థ్రిల్లర్ ఏటూరునాగారం ఐటీడీఏ ఏపీఓ తిరునగిరి రఘు పదవీ విరమణ సన్మాన సభ

ఆసుపత్రి సేవలను పరిశీలించిన హెల్త్‌కేర్ విద్యార్థులు

Select Suryaa Now
ఆసుపత్రి సేవలను పరిశీలించిన హెల్త్‌కేర్ విద్యార్థులు
కొడంగల్, మేజర్ న్యూస్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల బీఎస్సీ హెల్త్‌కేర్ విద్యార్థులు బుధవారం కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రి, క్రిటికల్ కేర్ విభాగాలను సందర్శించారు. పాఠ్య ప్రణాళికలో భాగంగా ఆసుపత్రిలోని ఐపీ, ఓపీ, ఐసీయూ, ఎమర్జెన్సీ, ల్యాబ్, ఎక్స్‌రే, ఈసీజీ, డయాలిసిస్ తదితర విభాగాల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్, సాంకేతిక సిబ్బంది విద్యార్థులకు ఆయా విభాగాల సేవలు, రోగుల నిర్వహణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. బి. శ్రీనివాస్ రెడ్డి, డా. సాకేత్, వైద్యులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
 
వ్యక్తిత్వ వికాసంతో లక్ష్యాలను చేరుకోవాలి
 
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఐక్యూఏసీ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథి డి.ఎస్.ఆర్. రాజేందర్ సింగ్ మాట్లాడుతూ విద్యార్థులు పట్టుదల, క్రమశిక్షణ, స్వీయ నియంత్రణతో ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు. విద్యతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని తెలిపారు. అనంతరం ఉత్తమ ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్ వి. సికిందర్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా. బి. శ్రీనివాస్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ రఫియా ఖానమ్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ టి. రాంబాబు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.