telanagana
డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి
Telanagana
01 Oct 2026
99 views
By సూర్య ప్రతినిధి
Updated : 01 Oct 2026 09:35 IST
Select Suryaa Now
మూడు చింతల పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోసకాయల వెంకటేష్
శామీర్‌పేట, మేజర్ న్యూస్ (అక్టోబర్ 1): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు అర్హులైన ప్రతి పట్టభద్రుడు తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని మూడు చింతల పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోసకాయల వెంకటేష్ గురువారం ఓ ప్రకటన కోరారు. సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభమైన నమోదు ప్రక్రియ నవంబర్ 6, 2026 వరకు కొనసాగుతుందని తెలిపారు. అర్హులైన పట్టభద్రులు ఫారం–18 ద్వారా ఓటరు నమోదును పూర్తి చేసుకోవాలని సూచించారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో కీలకమని, అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
రిపోర్టర్ తాటికొండ రవి గౌడ్.