సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన ఆత్రం సుగుణక్క
సూర్య జైనూర్ : అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన జైనూర్ మండలానికి చెందిన సయ్యద్ చాంద్ కు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క అందజేశారు.చికిత్స అనంతరం వైద్య ఖర్చులకు సంబంధించిన బిల్లులను సీఎంఆర్ఎఫ్‌కు సమర్పించగా, ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం మంజూరైంది. ఈ మేరకు జైనూర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సుగుణక్క చెక్కును సయ్యద్ చాంద్‌కు రు 25500/అందజేశారు. అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొన్న కుటుంబానికి ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయం వైద్య ఖర్చుల భారాన్ని కొంత మేర తగ్గించేందుకు ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డీసీసీ జనరల్ సెక్రటరీ ముఖిద్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా చైర్మన్ సుద్దాల శ్రీనివాస్, జైనూర్ మండల అధ్యక్షులు షైక్ రషీద్, మండల కార్యదర్శులు తుమ్రం కోటేష్, షైక్ ఇస్లాం, మండల సీనియర్ నాయకులు దండుగుల మహేష్, ఖలీల్, మేశ్రం ఇంద్రు, షాకీర్, రహీం, షైక్ అబ్బు చాంద్, దత్త, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.