రేపు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కీలక ప్రెస్‌మీట్
అనంతపురం బ్యూరో
మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి రేపు ఉదయం 8 గంటలకు కీలక ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. అల్పాహారంతో పాటు ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రెస్‌మీట్‌లో ఆయన పలు ముఖ్యమైన అంశాలపై మాట్లాడనున్నట్లు సమాచారం.
ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, ప్రజలకు సంబంధించిన అంశాలు, స్థానిక రాజకీయ పరిస్థితులపై ప్రభాకర్ చౌదరి తన అభిప్రాయాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కొన్ని కీలక విషయాలను ఆయన వెలుగులోకి తీసుకురానున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మాజీ ఎమ్మెల్యే నిర్వహించనున్న ఈ ప్రెస్‌మీట్‌పై పార్టీ శ్రేణులు, రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఆయన ఎలాంటి అంశాలను ప్రస్తావించనున్నారు.. ఏ విషయాలను వెల్లడించనున్నారు.. అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. రేపటి ప్రెస్‌మీట్‌లో ప్రభాకర్ చౌదరి చేసే వ్యాఖ్యలు రాజకీయంగా ఎలాంటి చర్చకు దారితీస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.