డిమాండ్ల సాధనకు పెన్షనర్లు గళం కలెక్టర్ కి వినతి
12 డిమాండ్ల సాధనకు పెన్షనర్ల గళం
కాకినాడ కలెక్టరేట్ ఎదుట ఆందోళన
ప్రధానికి వినతిపత్రం పంపాలని కలెక్టర్‌కు అందజేత
కాకినాడ: పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంతో పాటు 12 ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ (SGPA) కాకినాడ జిల్లా సంఘం ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఉదయం 10 గంటల వరకు పెన్షనర్లు నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్, న్యూఢిల్లీ, SGPA–AP గుంటూరు పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. పెన్షనర్లకు సంబంధించిన 12 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అనంతరం ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ వినతిపత్రాన్ని ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించాలని కోరారు.
దీర్ఘకాలం ప్రభుత్వ సేవలో పనిచేసి పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి, పెన్షనర్లకు రావాల్సిన ప్రయోజనాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన నిర్ణయం తీసుకోవాలని సంఘం ప్రతినిధులు కోరారు.