BREAKING
*అర్హులైన పేదలందరికీ పింఛన్లు ఇవ్వాలి* ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతాం.. అహుడ చైర్మన్ టిసి వరుణ్ అక్టోబర్ 9న నిర్వహించే జాబ్ మేళాను విజయవంతం చేయాలి ప్రజా తీర్పుపై అలిగి ప్రతిపక్షం పలాయనం.. రాష్ట్ర పునర్నిర్మాణమే కూటమి లక్ష్యం: సీఎం చంద్రబాబు అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ప్రవేశాల గడువు 13 వరకు పొడిగింపు డీఎంకే మురళి సేవలు చిరస్మరణీయం.. బీసీల ఓట్లు కావాలి కానీ.. సీట్లు మాత్రం వద్దా?* ముగిసిన ఎర్రవల్లి భూముల సర్వే.. కలెక్టర్‌కు నివేదిక సమర్పించిన అధికారులు పాలకీడు పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఆకస్మిక తనిఖీ* కారు, ద్విచక్ర వాహనం తో పాటు ఎర్ర చందన దుంగలు స్వాధీనం. ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి ప్రొద్దుటూరు లో సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారుల కసరత్తు ఘనంగా అంగన్ వాడీ ఉత్సవాలు, జాతీయ పోషణ మాసం పోలేరమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు

పౌర హక్కులపై అవగాహన అవసరం

Select Suryaa Now
పౌర హక్కులపై అవగాహన అవసరం

పౌర హక్కులపై అవగాహన అవసరం.

భూపాలపల్లి సూర్యప్రతినిధి సెప్టెంబర్ 30,మేజర్ న్యూస్.

పౌరహక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని భూపాలపల్లి తహశీల్దార్, ఆదేశాల మేరకు బుధవారం సెగ్గంపల్లి గ్రామంలో 1వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్  బౌతు శోభ అధ్యక్షతన పౌరహక్కులపై అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ శ్రీమతి బౌతు. శోభ మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా కల్పించిన పౌర హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. హక్కులకు ఎలాంటి భంగం కలిగినా చట్టపరమైన చర్యలు చేపట్టి, తమ హక్కుల సాధనకు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పాల్గొన్న గిర్ధవార్ రామస్వామి మాట్లాడుతూ పౌరులు తమ హక్కులను ఎలా వినియోగించుకోవాలో ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో భూ సమస్యలు ఉంటే సంబంధిత రెవెన్యూ అధికారులను సంప్రదించి పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించాలని, విద్య ద్వారా సమాజంలో ఉన్నత స్థానాలను సాధించవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో జిపివో బండి శ్రీనివాస్, కార్యాలయ సిబ్బంది వరుణ్, తరుణ్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.