BREAKING
పాల ఉత్పత్తిలో గ్రామీణ మహిళలే కీలకం -సీడీటీలో ఘనంగా జాతీయ పాల దినోత్సవం -ఉత్తమ మహిళా పాడి రైతుగా టి.విద్యకు సత్కారం రాజ్యాంగ విలువలే విద్యార్థులకు మార్గదర్శకం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కలసిన కార్పొరేటర్ షాహినా. ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ సదాశివపల్లిలో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి విజ్ఞాన పరిషత్ ఎన్నికల ప్రచారం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.. ఓటు హక్కును నిలబెట్టుకుందాం! ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీ కలిసిన కార్పొరేటర్ శంకర్ యాదవ్. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో సరళ ఫిజిక్స్ కాన్‌క్లేవ్`2026 కొమ్మరపూడి నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ ఆందోళన! టవర్ లైట్స్ కి శంకుస్థాపన అగ్ని ప్రమాదంలో బస్సు దగ్ధం చంద్రబాబును కలిసిన కార్పొరేటర్ ఆర్ సి మునికృష్ణ ఏపిలగుంటలో పొడమేకల ముమ్మర ప్రచారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ప్రొద్దుటూరు లో సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారుల కసరత్తు

Select Suryaa Now
ప్రొద్దుటూరు లో సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారుల కసరత్తు

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి

ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్ :

జలజీవన్ మిషన్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 5న ప్రొద్దుటూరుకు రానున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. ప్రొద్దుటూరు ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో గురువారం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా తదితరులతో కలిసి వివిధ శాఖల అధికారులతో సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా సమీక్ష: సభా ప్రాంగణం, వేదిక, బారికేడింగ్, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్య ఆరోగ్య సేవలు, అగ్నిమాపక, భద్రత తదితర ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు. ప్రతి శాఖకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. భద్రతపై ప్రత్యేక దృష్టి: సీఎం పర్యటన సందర్భంగా భద్రతా చర్యలను పటిష్టంగా అమలు చేయాలని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల రాకపోకలు, పార్కింగ్ ప్రాంతాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. విజయవంతం చేసేలా చర్యలు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారిగా ప్రొద్దుటూరుకు వస్తున్న నేపథ్యంలో పర్యటనను విజయవంతం చేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి కోరారు. జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా మాట్లాడుతూ ప్రతి శాఖకు కేటాయించిన విధులను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తి చేయాలని సూచించారు.

సభా ప్రాంగణం, హెలిప్యాడ్ పరిశీలన: అనంతరం కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా, ఇతర అధికారులు బహిరంగ సభ ప్రాంగణం, హెలిప్యాడ్ ప్రాంతాలను పరిశీలించారు. ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో ఏపీ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వి.ఎస్. ముక్తియార్, ప్రొద్దుటూరు ఏఎస్పీ కృష్ణ, వివిధ డివిజన్ల ఆర్డీఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జాన్ ఇర్విన్, డీఆర్‌డీఏ పీడీ రాజ్యలక్ష్మి, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్‌అండ్‌బీ, ఎస్‌పీడీసీఎల్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.