BREAKING
సింగరేణిని అప్పుల ఊబిలోకి నెట్టారు -బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలపై ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపణలు అమెరికా రాయబారికి సమన్లు జారీ చేసిన దక్షిణాఫ్రికా! సీఎం చంద్రబాబు పట్టాల పంపిణీకి 26వ డివిజన్‌ నుంచి బైక్‌ ర్యాలీ మలేషియా చర్యపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన! బుట్ట ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఉపాధి కల్పన ఇటలీలో పడిపోయిన వ్యాపార, వినియోగదారుల విశ్వాసం కేంద్ర సిఇసి రాజీనామా చేయాలి -తక్షణం ఆయన రాజీనామా చేయాలని -తిరుపతిలో కాంగ్రెస్ భారీ నిరసన ర్యాలీ 'బామ్మ' నిక్‌నేమ్‌తో రాజకీయాల్లో కలకలం రేపుతున్న సీనియర్ నేత! కప్తానుపాలెం వద్ద కారు–ఆటో ఢీ పారిశుద్ధ్య కార్మికుల సేవలకు సత్కారం.... గ్రీస్‌లో పెట్రోల్, డీజిల్ రాయితీలను పొడిగించిన హెల్లెనిక్ ఎనర్జీ! ఇరాక్ చమురు ఆదాయాలపై అమెరికా పట్టు బిగింపు గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు దసరా ఉత్సవ ఆహ్వాన పత్రిక అందజేత సమాజంలో యువతదే కీలక పాత్ర. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రాష్ట్రస్థాయి వుషు పోటీల్లో వైష్ణవికి స్వర్ణ పతకం

పాఠశాల సమస్యలపై ఎస్ఎఫ్ఐ పరిశీలన

Select Suryaa Now
పాఠశాల సమస్యలపై ఎస్ఎఫ్ఐ పరిశీలన

 

అనంతపురం బ్యూరో: ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్కూల్ బచావో’ కార్యక్రమంలో భాగంగా నగరంలోని పలు పాఠశాలలను పరిశీలించారు. పాపంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారు 400 మంది విద్యార్థులు ఉండగా, తరగతి గదుల కొరతతో ఒక్కో గదిలో 75 మంది వరకు కూర్చోవాల్సి వస్తోందని ఎస్ఎఫ్ఐ నాయకులు తెలిపారు.

విద్యార్థులకు అవసరమైన తరగతి గదులను ఏర్పాటు చేయడంతో పాటు, నిలిచిపోయిన ‘నాడు–నేడు’ రెండో విడత పనులను పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు. పాఠశాలకు క్రీడా మైదానం కోసం స్థలం కేటాయించాలని, మధ్యాహ్న భోజనానికి ప్రత్యేక భోజనశాల ఏర్పాటు చేయాలని కోరారు. పాఠశాలలో గుర్తించిన సమస్యలపై జిల్లా కలెక్టర్, డీఈఓను కలిసి వినతిపత్రం సమర్పించేందుకు నివేదిక సిద్ధం చేసినట్లు ఎస్ఎఫ్ఐ నాయకులు తెలిపారు.