సీఎం చంద్రబాబు చేతుల మీదుగా దసరా ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ
ఇంద్రకీలాద్రి, సెప్టెంబర్ 30, మేజర్ న్యూస్ : శ్రీ పరాభవ నామ సంవత్సర దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం ఉదయం ఉత్సవ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. అనంతరం ఆహ్వాన పత్రికను అర్చకులు, దేవాదాయశాఖ కమిషనర్ కే. రామచంద్ర మోహన్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వి.కె. శీనా నాయక్, స్థానాచార్య వి. శివ ప్రసాద్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు శంకర శాండిల్య ముఖ్యమంత్రికి అందజేశారు. మూలా నక్షత్రం రోజున శ్రీ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమం గురించి వారు ముఖ్యమంత్రికి వివరించారు.