గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు దసరా ఉత్సవ ఆహ్వాన పత్రిక అందజేత
ఇంద్రకీలాద్రి, సెప్టెంబర్ 30, మేజర్ న్యూస్ : శ్రీ పరాభవ నామ సంవత్సర దసరా ఉత్సవాలను పురస్కరించుకుని బుధవారం మధ్యాహ్నం రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌కు ఉత్సవ ఆహ్వాన పత్రికను దేవాదాయశాఖ కమిషనర్ కే. రామచంద్ర మోహన్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వి.కె. శీనా నాయక్, స్థానాచార్య వి. శివ ప్రసాద్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు శంకర శాండిల్య తదితరులు అందజేశారు. దసరా ఉత్సవాల సందర్భంగా నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమాల వివరాలను గవర్నర్‌కు వారు వివరించారు.