అంగన్‌వాడీ సిబ్బందికి ఘన సన్మానం
యాలాల మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా ఆధ్వర్యంలో అంగన్ మిలన్ సేవా కార్యక్రమాలు
యాలాల, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 30): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా యాలాల మండలంలో బుధవారం అంగన్ మిలన్ సేవ’ కార్యక్రమాలను నిర్వహించారు.బీజేపీ సీనియర్ నాయకుడు, యాలాల మాజీ ఎంపీపీ బాలేశ్వరం గుప్తా, మండల అధ్యక్షుడు ఆకుల శివకుమార్ ఆధ్వర్యంలో లక్ష్మీనారాయణపూర్,అగ్గనూరు, తిమ్మాయిపల్లి గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించారు.ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్లు,ఆయమ్మలను శాలువాలతో సన్మానించి,చిన్నారుల అభ్యాసం,ఆరోగ్యం,భవిష్యత్తు కోసం వారు అందిస్తున్న సేవలను అభినందించారు.
అనంతరం అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు పండ్లు,బిస్కెట్లు పంపిణీ చేశారు. గర్భిణులు, అంగన్‌వాడీ సిబ్బందితో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మహిళలు చిన్నారుల కోసం అందుతున్న సేవలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో సంగెంకుర్దు ఉపసర్పంచ్ వెంకటేశం,రాస్నం సర్పంచ్,ఉపసర్పంచ్ మధుగౌడ్, అరుణ్‌కుమార్, శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రిపోర్టర్ ప్రకాష్ గౌడ్.