BREAKING
సింగరేణిని అప్పుల ఊబిలోకి నెట్టారు -బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలపై ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపణలు అమెరికా రాయబారికి సమన్లు జారీ చేసిన దక్షిణాఫ్రికా! సీఎం చంద్రబాబు పట్టాల పంపిణీకి 26వ డివిజన్‌ నుంచి బైక్‌ ర్యాలీ మలేషియా చర్యపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన! బుట్ట ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఉపాధి కల్పన ఇటలీలో పడిపోయిన వ్యాపార, వినియోగదారుల విశ్వాసం కేంద్ర సిఇసి రాజీనామా చేయాలి -తక్షణం ఆయన రాజీనామా చేయాలని -తిరుపతిలో కాంగ్రెస్ భారీ నిరసన ర్యాలీ 'బామ్మ' నిక్‌నేమ్‌తో రాజకీయాల్లో కలకలం రేపుతున్న సీనియర్ నేత! కప్తానుపాలెం వద్ద కారు–ఆటో ఢీ పారిశుద్ధ్య కార్మికుల సేవలకు సత్కారం.... గ్రీస్‌లో పెట్రోల్, డీజిల్ రాయితీలను పొడిగించిన హెల్లెనిక్ ఎనర్జీ! ఇరాక్ చమురు ఆదాయాలపై అమెరికా పట్టు బిగింపు గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు దసరా ఉత్సవ ఆహ్వాన పత్రిక అందజేత సమాజంలో యువతదే కీలక పాత్ర. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రాష్ట్రస్థాయి వుషు పోటీల్లో వైష్ణవికి స్వర్ణ పతకం

విద్యుత్ కోతలపై బిజెపి నిరసన

Select Suryaa Now
విద్యుత్ కోతలపై బిజెపి నిరసన

విద్యుత్ కోతలపై బీజేపీ నిరసన

24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్

గణపురం, సెప్టెంబర్ 30 మేజర్ న్యూస్ సూర్య: తెలంగాణలో విద్యుత్ కోతలను నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపు మేరకు గణపురం మండల కేంద్రంలోని విద్యుత్ ఉపకేంద్రం ఎదుట బీజేపీ నాయకులు బుధవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ మండల కన్వీనర్ మంద మహేష్ మాట్లాడుతూ వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని, రైతులకు ఎదురవుతున్న విద్యుత్ కోతలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

విద్యుత్ సరఫరాలో అంతరాయాలతో రైతులు పంటలకు నీరు అందించలేక ఇబ్బందులు పడుతున్నారని, అరకొర త్రీఫేజ్ సరఫరాతో మోటార్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఫసల్ బీమా పథకాన్ని వెంటనే అమలు చేయాలని, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కోతలు కొనసాగితే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సోమ దామోదర్, బోద్దుల మొగిలి, మాదాస మొగిలిగౌడ్, నాయకపు నరసింహారాములు, మాడిశెట్టి సాంబశివుడు, వడ్డం రాజశేఖర్, వేముల రమేష్ గౌడ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.