BREAKING
పదవి విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఘన సత్కారం - ఎస్పీ అఖిల్ మహాజన్ మూడో త్రైమాసికంలో కాస్త మందగించనున్న యూరప్ కంపెనీల లాభాలు పాలిటెక్నిక్ కళాశాలకు పూర్వ విద్యార్థి మాతృమూర్తి విరాళం క్రీడల్లో చైతన్య విద్యార్థుల ప్రతిభ పేదరిక నిర్మూలనే లక్ష్యంగా 'బంగారు కుటుంబం' కార్యక్రమం:ఎమ్మెల్యే కోళ్ల సత్యనారాయణ జ్ఞాపకార్థం దివ్యాంగులకు నిత్యావసర వస్తువుల పంపిణీ. రొమేనియాలో తీవ్రమవుతున్న రాజకీయ ప్రతిష్టంభన ఖలీల్ బేగ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ దండే విఠల్ అమ్మాయిలను కాదు అబ్బాయిలను మార్చండి.. బాలీవుడ్ నటి దియా మీర్జా కీలక వ్యాఖ్యలు పారిశుధ్య కార్మికులకు ఉచిత వైద్య పరీక్షలు. రక్తదానం ప్రాణదానం మహాదానం బుచ్చిరాం అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోసిన మాజీ ఎమ్మెల్యే సెమీఫైనల్స్ పోరులో మలేషియా చేతిలో పోరాడి ఓడిన భారత్ శ్రీరాంపూర్‌ ఏరియాకు 99 శాతం ఉత్పత్తి -- మూడు భూగర్భ గనుల్లో లక్ష్యానికి మించి ఉత్పత్తి - ఓసీల్లో 101 శాతం - వార్షిక లక్ష్యాన్ని అధిగమిస్తాం - జీఎం మునిగంటి శ్రీనివాస్ బీసీలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు

షాద్‌నగర్‌లో కలకలం.. కళాశాలకు వెళ్లి అదృశ్యమైన ఇంటర్ విద్యార్థిని

Select Suryaa Now
షాద్‌నగర్‌లో కలకలం.. కళాశాలకు వెళ్లి అదృశ్యమైన ఇంటర్ విద్యార్థిని

సూర్య తెలంగాణ డెస్క్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో ఒక ఇంటర్ విద్యార్థిని అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. షాద్‌నగర్‌లోని విజ్ఞాన్ కళాశాలలో ఇంటర్మీడియట్ అభ్యసిస్తున్న ఆయేషా అనే యువతి గత నెల 29వ తేదీ సాయంత్రం నుంచి కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పتిలాగే కళాశాలకు వెళ్లిన ఆమె, తిరిగి ఇంటికి రాకపోవడంతో బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు.

విద్యార్థిని ఆచూకీ దొరకకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఆటోలు, సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తూ గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆయేషా ఆచూకీ ఎవరికైనా లభిస్తే వెంటనే 7730973603 నెంబర్‌‌కు సమాచారం అందించాలని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ విజ్ఞప్తి చేస్తున్నారు.

జవాజి రాఘవేంద్ర గౌడ్, మేజర్ న్యూస్, షాద్ నగర్.