పౌరులందరూ హక్కులతో పాటు బాధ్యతలు తెలుసుకోవాలి - తహసీల్దార్..
సూర్య బోయినపల్లి.. ప్రతి పౌరుడు రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు బాధ్యతలను కూడా తెలుసుకోవాలని తహసీల్దార్ షరీఫ్ మోయినుద్దీన్ అన్నారు.మండలంలోని తడగొండ గ్రామంలోని అంబేద్కర్ భవనం వద్ద గురువారం పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని, అంటరానితనం, కుల వివక్షకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలని పిలుపునిచ్చారు.అనంతరం ఎస్సై రమాకాంత్ మాట్లాడుతూ పౌర హక్కులకు భంగం కలిగినప్పుడు చట్టపరంగా పొందే రక్షణ గురించి వివరించారు. వివక్షకు గురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రవణ్ కుమార్, సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ వెంకటేష్, డైరెక్టర్ గుడి శ్రీనివాసరెడ్డి, మాజీ మండల కోఆప్షన్ సభ్యులు హైమద్ హుస్సేన్, అంబేద్కర్ సంఘం నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.