BREAKING
స్వచ్ఛతలో సత్తా చాటిన మాచవరం పంచాయితీ స్వచ్ఛతలో కోనసీమకు 67 స్వచ్ఛాంధ్ర అవార్డులు..ఎంపీ గంటి హరీష్ మాధుర్ బాలయోగి,... మహిక ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రారంభం.. కారెం శివాజీని పరామర్శించిన మందకృష్ణ మాదిగ.... నేటి పంచాంగం — 3 అక్టోబర్ 2026, శనివారం నేటి రాశి ఫలాలు: 3 అక్టోబర్ 2026, శనివారం.. ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర టెక్ ప్రపంచంలో సరికొత్త చర్చ గ్రామ సభలో నిధుల లేక్కెంటీ..? అంగన్వాడీలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలి గాంధీ జయంతి రోజున ముంబైలో సీజేపీ నిరసన: జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో రోడ్లపైకి జనం, పోలీసుల అనుమతి నిరాకరణ మధ్య ఉద్రిక్తత బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై చంద్రబాబు చెప్పేవి అబద్ధాలు: రాజమహేంద్రవరంలో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సవాల్, 100 సీట్ల హామీపై నిలదీత చీనాబ్ - అంజీ బ్రిడ్జిలపై తొలిసారి గంటకు 100 కి.మీ. వేగంతో వందే భారత్ రోజూ కాఫీ తాగుతున్నారా... లివర్‌పై దాని ప్రభావం ఇదే! పండ్లు ఏ సమయంలో తింటే ఆరోగ్యానికి మంచిది? ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో తినడంపై నిపుణుల సలహాలు!

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో డిజిటలైజేషన్ వేగవంతం చేయాలి - రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

Select Suryaa Now
ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో డిజిటలైజేషన్ వేగవంతం చేయాలి - రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
సూర్య, మంచిర్యాల జిల్లా ప్రతినిధి : ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ నుండి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఈ.ఆర్.ఓ.లు, ఎ.ఈ.ఆర్.ఓ.లు, ఎన్నికల విభాగం అధికారులతో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పురోగతి, మ్యాపింగ్ కాని ఓటర్లు, అనమలిస్‌ జాబితాలో ఉన్న ఓటర్లకు జారీ చేసిన నోటీసులు, వారి ఇండ్లకు వెళ్లి వారి నుంచి ధృవపత్రాల స్వీకరణ, వివరాల డిజిటలైజేషన్ తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ మ్యాపింగ్ కాని, అనమలిస్‌ జాబితాలో ఉన్న ఓటర్లకు జారీ చేసిన నోటీసులకు సంబంధించి బూత్ స్థాయి అధికారులు ఓటర్ల ఇండ్ల వద్దకు వెళ్లి అవసరమైన ధ్రువపత్రాలను సేకరించాలని తెలిపారు. ఎ.ఈ.ఆర్.ఓ.లు తమ పరిధిలోని బూత్ స్థాయి అధికారులు, సూపర్‌వైజర్లతో సమన్వయం చేసుకుంటూ ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. నిర్ణీత గడువులోగా ప్రక్రియను పూర్తి చేసే విధంగా సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా కొనసాగేందుకు సంబంధిత అధికారులు పరస్పర సమన్వయంతో పని చేయాలని తెలిపారు.వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో నోటీసులు జారీ చేయబడిన ఓటర్లకు సంబంధించి వారి ఇండ్ల వద్ద అవసరమైన ధ్రువపత్రాల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతీరామ్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాసరావు ప్రత్యేక ఉపపాలన అధికారి చంద్రకళ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ, ఎఈఆర్‌ఓలు, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.