మినీ గోకులం షెడ్డు శంకుస్థాపన లో ఎమ్మెల్యే బొలిశెట్టి
పెంటపాడు, మేజర్ న్యూస్; పెంటపాడు గ్రామంలో మినీ గోకులం షెడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ హాజరై శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాడి రైతులకు ఉపయోగకరంగా ఉండేలా మినీ గోకులం షెడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, రైతుల సంక్షేమం మరియు పశుసంపద అభివృద్ధికి అవసరమైన సహకారం అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే గారు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎన్డీఏ కూటమి నాయకులు, స్థానిక నాయకులు, రైతులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
శ్రీనివాస్ తాడేపల్లిగూడెం