BREAKING
రేపు కల్కి భగవాన్ మహాసమాధి.. అధికారిక లాంఛనాలతో ఏర్పాట్లు పూర్తి అమెరికాలో ఊహించని రీతిలో పెరిగిన నిర్మాణ రంగ వ్యయాలు అమరావతిలో నారా లోకేష్‌తో చిన్న శ్రీను, సిరమ్మ భేటీ ,విజయనగరం జిల్లా పార్టీ పరిస్థితులపై చర్చ.. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని సూచన భారత్‌లో ప్రభుత్వ ఆదేశాలను వ్యతిరేకిస్తున్న పెప్సికో, మాన్స్టర్ వెనిజులాలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్న ఐఎంఎఫ్ స్పష్టీకరణ ఇజ్రాయెల్ సెటిలర్ల కాల్పుల్లో పాలస్తీనా వ్యక్తి మృతి కోనసీమ ముఖద్వారం రావులపాలెంకు ‘స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర’ అవార్డు రేపు ధర్మవరం, పుట్టపర్తిలలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటన * స్వచ్ఛభారత్, చెక్కుల పంపిణీతో పాటు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్ర సత్య కుమార్ యాదవ్ ధర్మవరం/పుట్టపర్తి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే జారే... ... బ్రెజిల్‌లో తుది దశకు ఎన్నికల వేడి - చివరి టీవీ డిబేట్‌ను బహిష్కరించిన అధ్యక్షుడు లూలా గ్రామీణ క్రీడాకారుల ప్రతిభకు వేదికగా ఆత్మకూరు క్రీడావికాస కేంద్రం అటార్నీ జనరల్ రోజర్ మారియాకా అరెస్ట్, డ్రగ్స్ అక్రమ రవాణా ఆరోపణలు వైసీపీ నుంచి టీడీపీ లోకి భారీ చేరికలు .....పదవుల కోసం కాదు... చిన్న శ్రీను వెంటే...... 1998 తర్వాత గరిష్ట స్థాయికి గిల్ట్ ఈల్డ్స్, కుప్పకూలిన బ్యాంకుల షేర్లు 30వ వార్డు సమస్యలపై శిరీషా ఫోకస్

పేదరిక నిర్మూలనే లక్ష్యంగా 'బంగారు కుటుంబం' కార్యక్రమం:ఎమ్మెల్యే కోళ్ల

Select Suryaa Now
పేదరిక నిర్మూలనే లక్ష్యంగా 'బంగారు కుటుంబం' కార్యక్రమం:ఎమ్మెల్యే కోళ్ల

 

లక్క వరపు కోట, అక్టోబర్ 01 మేజర్ న్యూస్ :
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పి4 (పీపుల్–పబ్లిక్–ప్రైవేట్ పార్టనర్‌షిప్) ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని పారద్రోలి ప్రతి ఇంటినీ ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పేర్కొన్నారు. ఎల్.కోట ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన పి4 మండల స్థాయి అధికారుల "బంగారు కుటుంబం" సమీక్షా సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సమాజంలో అట్టడుగున ఉన్న కుటుంబాలను గుర్తించి, వారి ఆర్థిక పురోభివృద్ధికి తగిన ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. 'బంగారు కుటుంబం' పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులైన ప్రతి లబ్ధిదారుడికీ ప్రయోజనం చేకూరేలా చూడాలన్నారు.

​ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ ఈ మురళి మాట్లాడుతూ అందుబాటులో వున్నా ప్రతి అవకాశం వినియోగించు కునే లా అధికారులు ప్రణాళికలు తయారు చేసి పంపిస్తే వాటి అనుమతులు కోసం ఎమ్మెల్యే ద్వారా  జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వం ద్రుష్టి కి తీసుకుని వెళ్తాము అన్నారు  ఈ కార్యక్రమం లో , ఎంపీడీవో అల్లు భాస్కర్ రావు తహసీల్దార్ హరి తో పాటు వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు..