BREAKING
మినీ గోకులం షెడ్డు శంకుస్థాపన లో ఎమ్మెల్యే బొలిశెట్టి సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ తెస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయం పారిశుధ్య కార్మికులతో కలిసి.. నాలా శుభ్రతలో చైర్‌పర్సన్‌ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో డిజిటలైజేషన్ వేగవంతం చేయాలి - రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి జిల్లా టేబుల్ టెన్నిస్ జట్లు ఎంపికలు గాంధీనగర్ పాఠశాలలో బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమం ప్రారంభం తరిగొండ వెంగమాంబ గోశాలకు విరాళాలు అందించి గోవులను ఆదుకోండి ఆకుతీగపాడు లో ‘పేదల సేవలో 2.0’ వయోవృద్ధులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలి - జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య హైకోర్టుకు స్పష్టం చేసిన ఎన్నికల సంఘం జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు - జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్ పోగొట్టుకున్న పర్సు ను 24 గంటల లోపే బాధితుడికి అప్పగించిన రామకృష్ణాపూర్ పోలీసులు. స్వచ్ఛతలో భాగస్వాములుకండి.. -సర్పంచ్ కవిత నర్సింగ్ విద్యార్థిని ఆత్మ హత్య.. ప్రతి నెల మొదటి రోజే అవ్వాతాతల ఇంటి వద్దకు పింఛన్ విజయలక్ష్మీ గునుకుల-జనసేన

పథకం ప్రకారమే యువకుని హత్య - నలుగురి అరెస్టు

Select Suryaa Now
పథకం ప్రకారమే యువకుని హత్య  - నలుగురి అరెస్టు

సూర్య, హుజురాబాద్.,ఇటీవల కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణ శివారులోని పెద్ద పాపయ్యపల్లి పరిధిలోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద ఉప్పులపల్లికి చెందిన వాడికి రాకేష్ ను పథకం ప్రకారం హత్య చేసిన నలుగురిని అరెస్టు చేసినట్లు హుజురాబాద్ ఏసిపి వాసంశెట్టి మాధవి అన్నారు. గురువారం హుజురాబాద్ పోలీస్ స్టేషన్ లో ఆమె మాట్లాడుతూ.... పాత కక్షలు, వివాహేతర సంబంధం మూలంగా రాకేష్ ను అంతమొందించాలి అనుకున్న అంబరగొండ ప్రశాంత్ పథకం ప్రకారం   9 మంది సహాయంతో రాకేష్ ను హత్య చేశాడని, గతంలో రాకేష్ చంపడానికి ప్రయత్నించినప్పటికీ వీలుగాకపోవడంతో పక్క ప్లాన్ తో ఈ హత్యకు సిద్ధమయ్యాడని ఆమె తెలిపారు. అందులో భాగంగా రాకేష్ కు మద్యం బాగా తాగించి అనంతరం కెనాల్ వద్ద అతనిని విచక్షణారహితంగా కత్తితో పొడిచి గొంతు కోసి చంపారని ఆమె తెలిపారు. కాగా ప్రశాంత్ పోలీస్ స్టేషన్లో లొంగిపోగా మిగతా వారిని పట్టుకొని విచారించి నట్లు ఆమె తెలిపారు. ప్రశాంత్ తో పాటు రాజ్ కుమార్ , రిత్విక్, తుమ్మల అఖిల్ లను అరెస్టు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ సంఘటనలో వాడిన నాలుగు కత్తులు స్వాధీనం చేసుకున్నామని, ఈ సంఘటనలో బాధ్యులైన టి అఖిల్ రాహుల్ చందు అజయ్ గణేష్లు పరారీలో ఉన్నట్లు వారిని కూడా త్వరలో పట్టుకుంటామని అన్నారు. ఈ సమావేశంలో హుజురాబాద్ టౌన్ సిఐ టీ కరుణాకర్, ఎస్సై రవి మధు , పోలీసులు పాల్గొన్నారు.