క్రీడల్లో చైతన్య విద్యార్థుల ప్రతిభ
క్రీడల్లో శ్రీచైతన్య విధ్యార్ధుల ప్రతిభ
- చదువుల్లో, క్రీడల్లో రానించినప్పుడే భవిష్యత్ కి పునాది
- కరస్పాండెంట్ బండ్రెడ్డి చక్రపాణిరెడ్డి
వేంపల్లె మేజర్ న్యూస్:
స్కూల్ ఆఫ్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి క్రీడా పోటిల్లో స్థానిక శ్రీచైతన్య ఉన్నత పాఠశాల విధ్యార్థులు ప్రతిభ చూపినట్లు కరస్పాండెంట్ బండ్రెడ్డి చక్రపాణి రెడ్డి వెల్లడించారు. గురువారం ఆ పాఠశాల ఆవరణలో వివిధ క్రీడల్లో ప్రతిభ చూపిన విధ్యార్థుల పట్ల కరస్పాండెంట్ అభినందించారు. మండల స్థాయిలో ప్రతిభ చూపిన విధ్యార్థులు నియోజకవర్గ స్థాయి పోటిలకు ఎంపికయ్యారు. ఖోఖో పోటిల్లో బి.శ్రీకాంత్, యు.జగన్, ఎస్.మేఘనాథ్, టి.తరుణ్ సాయి. వాలిబాల్ పోటిల్లో టి.దినేష్, బి.ప్రణీత్, ఏ.పవన్, ఎం.అనిరుధ్, ఏ.సిద్ధార్థ, యు.కార్తీక్. యోగా పోటిల్లో బి.శ్రీకాంత్, చెస్ పోటిల్లో ఓ.గీతాశ్రీ, అభినవ్, టి.తునుశ్రీ లు ప్రతిభ చూపి నియోజకవర్గ స్థాయి పోటిలకు ఎంపికయ్యారు. అలాగే అథ్లెటిక్స్ విభాగంలో పలు పతకాలు కైవసం చేసుకున్నారు. 400 మీటర్ల పరుగుపందెం పోటిల్లో పి.కాశేశ్వర, బి.గౌతమ్ రెడ్డి లు ప్రథమ స్థానంలో నిలిచారు. షాట్పూట్ లో పి.ప్రణీత్ ద్వితీయ స్థానం, బి.మైనావతి తృతీయ స్థానం సాధించారు. 100 మీటర్ల పరుగుపందెం పోటిల్లో బి.మైనావతి ద్వితీయ స్థానం, ఎం.గంగ తులసిధర్ తృతీయ స్థానం సాధించారు. లాంగ్ జంప్ లో పి.కాశేశ్వర తృతీయ స్థానంలో నిలిచారు. 1500 మీటర్ల పరుగుపందెం పోటిల్లో బి.గౌతమ్ రెడ్డి, 100 మీటర్లు సి.నిషిత ప్రధమ స్థానాలు కైవసం చేసుకున్నారు. 200 మీటర్లు సి.నిషిత, డీ.హేమలత తమ ప్రతిభతో విజయాలను సొంతం చేసుకున్నారు. విధ్యార్థుల కృషి, క్రమశిక్షణ, పట్టుదలే ఈ విజయాలకు నిదర్శనమని కరస్పాండెంట్ బండ్రెడ్డి చక్రపాణిరెడ్డి అభిప్రాయపడ్డారు. చదువుతో పాటు క్రీడల్లో గుర్తింపు సాధించేలా మరింత కృషి చేయాలని, వీటిలో రానించినప్పుడే భవిష్యత్ కి పునాదిగా నిలుస్తోందన్నారు. నియోజకవర్గ స్థాయి పోటిల్లో తమ ప్రతిభను చూసి మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. అలాగే విధ్యార్థులకు అల్ ది బెస్ట్ తెలియజేశారు. అంతేకాకుండా వీరికి తర్పీదు ఇచ్చిన క్రీడా ఉపాధ్యాయున్ని అభినందించారు.