*తాడేపల్లిగూడెంలో బియస్ యన్ యల్ ఉద్యోగుల ద్విచక్రవాహన ర్యాలీ :*
తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; బియస్ యన్ యల్ 26వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఆ సంస్థ ఉద్యోగులు తాడేపల్లిగూడెం పట్టణంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. వినియోగదారులకు బియస్ యన్ యల్ అందించే వివిధ ఆధునిక సేవల వివరాలను తెలిపే ప్లకార్డులను ఈసందర్భంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ ఇంజనీర్ కెవిఏపి సుబ్బారావు, సబ్ డివిజనల్ ఇంజనీర్లు, ప్రసాద్, ప్రతాప్ కుమార్, జెటిఓలు మధుబాబు, సూర్రెడ్డి, పట్నాయక్, శంకర్ నాయక్,సుజాత, ఇతర ఉద్యోగులు మరియు టిప్ భాగస్వాములు పాల్గొన్నారు.
శ్రీనివాస్ తాడేపల్లి గూడెం