నొప్పి నివారణకు నర్వ్ బ్లాక్ కీలకం
రోగి పరిస్థితిని బట్టే సర్జరీ : డాక్టర్ చవల ప్రకాష్
నొప్పి తీవ్రతను బట్టి సెలెక్టివ్ నర్వ్ బ్లాక్ చికిత్స
నొప్పి తగ్గిన అనంతరం ఫిజియోథెరపీతో చికిత్స
తీవ్రమైన లక్షణాలున్నవారికే శస్త్రచికిత్స అవసరం
జాయింట్ రీప్లేస్‌మెంట్, ఆర్థ్రోస్కోపీతో ఆధునిక వైద్యం
పామూరు, మేజర్ న్యూస్ :
ప్రతి నొప్పికీ శస్త్రచికిత్స అవసరం లేదని రోగి నొప్పి తీవ్రత ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా పరిశీలించిన అనంతరం అవసరమైన వారికి ముందుగా సెలెక్టివ్ నర్వ్ బ్లాక్ చికిత్స అందించి నొప్పిని నియంత్రించవచ్చని ఒంగోలుకు చెందిన ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య నిపుణులు, జాయింట్ రీప్లేస్‌మెంట్, కీ-హోల్ సర్జరీస్ (ఆర్థ్రోస్కోపీ) శస్త్రచికిత్స వైద్య నిపుణులు, ఆసుపత్రి ఎండీ డాక్టర్ చవల ప్రకాష్ తెలిపారు. గురువారం పట్టణంలోని అశ్విని వైద్యశాలలో ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎముకలు, కీళ్లు, నరాలకు సంబంధించిన వివిధ సమస్యలతో బాధపడుతున్న రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి తగిన సూచనలు, చికిత్స అందించారు.
నొప్పి తీవ్రతను బట్టి సెలెక్టివ్ నర్వ్ బ్లాక్ చికిత్స
సర్జరీ అవసరమయ్యే రోగులకు ముందుగా నొప్పి తీవ్రతను బట్టి ప్రత్యేక ఇంజెక్షన్ల ద్వారా సెలెక్టివ్ నర్వ్ బ్లాక్ చికిత్స అందిస్తున్నామని డాక్టర్ చవల ప్రకాష్ తెలిపారు. ఈ విధానంతో నొప్పిని తగ్గించిన అనంతరం ఫిజియోథెరపీ సహకారంతో చికిత్స కొనసాగిస్తున్నామని చెప్పారు. ఈ చికిత్సా విధానాల ద్వారా సుమారు సగం మంది రోగుల్లో సర్జరీ అవసరాన్ని నివారించగలుగుతున్నామని వివరించారు.
తీవ్రమైన లక్షణాలున్నవారికే శస్త్రచికిత్స అవసరం
నరాల బలహీనత అభివృద్ధి చెంది కండరాల శక్తి కోల్పోవడం, మూత్ర విసర్జనపై నియంత్రణ కోల్పోవడం వంటి తీవ్రమైన లక్షణాలు ఉన్నవారికి మాత్రమే శస్త్రచికిత్స చేస్తున్నామని తెలిపారు. రోగి పరిస్థితిని పూర్తిగా పరిశీలించిన అనంతరం అవసరమైతేనే సర్జరీకి వెళ్తామని స్పష్టం చేశారు.
జాయింట్ రీప్లేస్‌మెంట్, ఆర్థ్రోస్కోపీతో ఆధునిక వైద్యం
జాయింట్ రీప్లేస్‌మెంట్, కీ-హోల్ సర్జరీస్ (ఆర్థ్రోస్కోపీ) వంటి ఆధునిక శస్త్రచికిత్సా విధానాలతో ఎముకలు, కీళ్ల సమస్యలకు వైద్య సేవలు అందిస్తున్నామని డాక్టర్ చావల ప్రకాష్ తెలిపారు. కీళ్ల నొప్పులు, కదలికల్లో ఇబ్బందులు, గాయాల కారణంగా ఏర్పడే సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. సరైన సమయంలో వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా సమస్య తీవ్రతను గుర్తించి తగిన చికిత్స అందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.