మందమర్రి ఏరియా నాలుగో స్థానానికి..
డిస్పాచ్‌లో 130 శాతం ప్రగతి
జిఎం ఎన్ రాధాకృష్ణ
సూర్య, మందమర్రి.సింగరేణి మందమర్రి ఏరియా సెప్టెంబర్ నెలలో బొగ్గు ఉత్పత్తిలో 113 శాతం, డిస్పాచ్‌లో 130 శాతం ప్రగతి సాధించి సంస్థలో నాలుగో స్థానానికి చేరుకుంది. 1,74,500 టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి గాను 1,97,448 టన్నులు ఉత్పత్తి చేసినట్లు జీఎం ఎన్. రాధాకృష్ణ తెలిపారు. గురువారం జిఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేకేఓసీ గనిలో 171 శాతం ఉత్పత్తి నమోదైందన్నారు. భారీ వర్షాలు కురిసినా లక్ష్యాలను అధిగమించామని, కార్మికులు, అధికారులు, సిబ్బంది సమిష్టి కృషితోనే ఈ ప్రగతి సాధ్యమైందని పేర్కొన్నారు. ఉత్పత్తితో పాటు భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.