BREAKING
లచ్చిగూడెం పేకాట స్థావరంపై పోలీసులు దాడి. స్వచ్ఛత, పారిశుద్ధ్య నిర్వహణలో విజయనగరం జిల్లాకు రాష్ట్రస్థాయి గుర్తింపు గాంధీజీకి విఘ్నేశ్వర, అధికారులు నివాళులు ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహిస్తాం : పద్మారావు గౌడ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ సమర సన్నద్ధం ఎస్.భూర్జవలస హెచ్ఎం కెవి సత్తిబాబుకు స్వచ్ఛత అవార్డు ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం (పి పి ఎల్)జిల్లా అధ్యక్షుడిగా ఉప్పలయ్య* విజయ కాలనీ అంగన్వాడీ కేంద్రానికి స్వచ్ఛ్ ఆంధ్ర అవార్డు చుండూరి నీ స్థాయేంటే....? జాతిపిత గాంధీజీ జయంతి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యాసంస్థలు వైద్యాలయాలలో చేయరా ? కంచనపల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక రామచంద్రపురం సబ్ జైలు తనిఖీ స్వచ్ఛ ఆంధ్రలో కమలాపురం ఆసుపత్రికి ప్రథమ స్థానం డాక్టర్ ఆమంచి శిరీషకు - కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు.. నడకతోనే సంపూర్ణ ఆరోగ్యం… ఎమ్మెల్యే బొలిశెట్టి హార్టికల్చర్ హబ్ ద్వారా రైతులు కు ఎంతో ఉపయోగకరం

పోలీసు అభ్యర్థులు ఉచిత శిక్షణ అవకాశాన్ని వినియోగించుకోవాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, జిల్లా ఎస్పీ జానకి షర్మిల

Select Suryaa Now
పోలీసు అభ్యర్థులు ఉచిత శిక్షణ అవకాశాన్ని వినియోగించుకోవాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, జిల్లా ఎస్పీ జానకి షర్మిల
సూర్య నిర్మల్ ప్రతినిధి, పోలీసు ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు జిల్లా కేంద్రంలోనే పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఉచిత శిక్షణ అవకాశాన్ని ఉద్యోగార్థులు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు.గురువారం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా పోలీసు అభ్యర్థులకు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి కలెక్టర్ భవేశ్ మిశ్రా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పోలీసు అభ్యర్థులకు ఉచిత భోజనంతో పాటు శిక్షణ అందిస్తున్న జిల్లా ఎస్పీ, పోలీసులకు, సహకరిస్తున్నవారికి శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాదు లాంటి దూర ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగ శిక్షణ పొందడం ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయమని, జిల్లా కేంద్రంలోనే అభ్యర్థులకు అందుబాటులో ఉన్న ఈ శిక్షణ ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రస్తుత కృత్రిమ మేధ (ఏఐ) కాలంలో ఉద్యోగం పొందడం కష్టంతో కూడుకున్న పని అని‌, ప్రస్తుతం ఉద్యోగాలకు ఎంతో పోటీ ఉందని, ప్రతి ఒక్కరు కష్టపడి చదివి ఉద్యోగం సాధించాలని ఆకాంక్షించారు. సెల్ ఫోన్ కు దూరంగా ఉండాలని సూచించారు. దూర ప్రాంతాల విద్యార్థులకు వసతి సౌకర్య కల్పనలో తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు.
పోలీసు ఉద్యోగమే లక్ష్యంగా అభ్యర్థులు కష్టపడాలి - జిల్లా ఎస్పీ జానకి షర్మిల
పోలీసు ఉద్యోగమే లక్ష్యంగా ప్రతి ఒక్క అభ్యర్థి కష్టపడి చదువుకోవాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. జిల్లా అభ్యర్థులకు ఉచిత పోలీసు శిక్షణలో సహకరించినవారికి, స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. ఉచిత పోలీసు శిక్షణకు దాదాపు 300 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారని అన్నారు. అభ్యర్థులకు ఒక పూట ఉచితంగా భోజనం, అల్పాహారం, అవసరమైన తదితర సౌకర్యాలు కల్పించనున్నట్లు చెప్పారు. సుదూర ప్రాంత విద్యార్థులకు అవసరమైన వసతి ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉద్యోగ సన్నద్ధానికి అవసరమైన మెటీరియల్ సమకూర్చేలా చూస్తామన్నారు. ఉద్యోగార్థులను పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు అనుభవజ్ఞులైన అధ్యాపకులను నియమించామని, అలాగే స్వయంగా బోధనా అనుభవం ఉన్న పోలీసు సిబ్బందిచే సైతం విద్యార్థులకు శిక్షణ ఇస్తామన్నారు. ప్రతి రెండ్రోజులకు ఒకసారి పరీక్షలు కూడా నిర్వహిస్తామని చెప్పారు. దేహదారుఢ్య (ఫిజికల్ ఈవెంట్స్) పరీక్షలకు అవసరమైన శిక్షణ సైతం అందిస్తామన్నారు. ఎటువంటి ఇబ్బందులు కలిగినా అందుబాటులో ఉన్న సిబ్బందికి తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భైంసా ఏఎస్పి సాయి కిరణ్, డీఎస్పి శ్రీనివాస్, ఇతర అధికారులు, పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.