BREAKING
గాంధీజీకి విఘ్నేశ్వర, అధికారులు నివాళులు ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహిస్తాం : పద్మారావు గౌడ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ సమర సన్నద్ధం ఎస్.భూర్జవలస హెచ్ఎం కెవి సత్తిబాబుకు స్వచ్ఛత అవార్డు ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం (పి పి ఎల్)జిల్లా అధ్యక్షుడిగా ఉప్పలయ్య* విజయ కాలనీ అంగన్వాడీ కేంద్రానికి స్వచ్ఛ్ ఆంధ్ర అవార్డు చుండూరి నీ స్థాయేంటే....? జాతిపిత గాంధీజీ జయంతి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యాసంస్థలు వైద్యాలయాలలో చేయరా ? కంచనపల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక రామచంద్రపురం సబ్ జైలు తనిఖీ స్వచ్ఛ ఆంధ్రలో కమలాపురం ఆసుపత్రికి ప్రథమ స్థానం డాక్టర్ ఆమంచి శిరీషకు - కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు.. నడకతోనే సంపూర్ణ ఆరోగ్యం… ఎమ్మెల్యే బొలిశెట్టి హార్టికల్చర్ హబ్ ద్వారా రైతులు కు ఎంతో ఉపయోగకరం శిథిలావస్థకు చేరిన సిసి రోడ్లు స్థానిక ఎన్నికల్లో నూరుశాతం కూటమి గెలవాలి

వృద్ధులను గౌరవించడం మన బాధ్యత చిన్నఅవుటపల్లిలో ప్రపంచ వృద్ధుల దినోత్సవం.

Select Suryaa Now
వృద్ధులను గౌరవించడం మన బాధ్యత  చిన్నఅవుటపల్లిలో ప్రపంచ వృద్ధుల దినోత్సవం.

గన్నవరం, అక్టోబరు 1, మేజర్ న్యూస్.

 వృద్ధులను గౌరవించడం, వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పలువురు వక్తలు అన్నారు. ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని చిన్నఅవుటపల్లిలోని పుణ్య చారిటీస్ ఓల్డేజ్ హోమ్‌లో గురువారం సాయంత్రం పుణ్య చారిటీస్, రోటరీ క్లబ్ గన్నవరం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. గన్నె వెంకటరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి విజయా డైరీ చైర్మన్ దాసరి బాలవర్ధన్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. కుటుంబంలో తల్లిదండ్రులను గౌరవించే విలువలను చిన్ననాటి నుంచే పిల్లలకు నేర్పాలని సూచించారు. వృద్ధాప్యం ఎవరికీ శాపంగా మారకూడదని, ప్రతి వృద్ధుడు గౌరవప్రదంగా జీవించేలా కుటుంబ సభ్యులు, సమాజం అండగా నిలవాలని కోరారు. వృద్ధుల అనుభవాలు దేశాభివృద్ధికి ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు వైస్‌చైర్మన్ ఆళ్ల గోపాలకృష్ణ, సీఆర్‌ఆర్‌ఈ కాలేజీ విశ్రాంత ప్రిన్సిపాల్ పెండ్యాల రామారావు, వీరమాచినేని భవానీ ప్రసాద్, రోటరీ క్లబ్ అధ్యక్షుడు టీఎస్‌ఆర్‌కే ప్రసాద్, కోశాధికారి నర్రా సీతారామారావు, రోటేరియన్ జి.వి.రవిబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఓల్డేజ్ హోమ్‌లోని వృద్ధులను ఘనంగా సత్కరించారు. ప్రతి ఏడాది వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, పెద్దలను గౌరవించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని పుణ్య చారిటీస్ కార్యదర్శి జాస్తి విజయ్ భూషణ్‌కుమార్ (బుజ్జి) తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.