59 మంది అర్హులైన వికలాంగులకు ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే బొలిశెట్టి
తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; తాడేపల్లిగూడెం శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ కలిసి తమ సొంత నిధుల నుండి 59 మంది అర్హులైన వికలాంగులకు రూ.1,77,000/- ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం వారందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వికలాంగుల సంక్షేమానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు అవసరమైన సహాయం అందేలా కృషి చేయడం తమ బాధ్యతగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
శ్రీనివాస్ తాడేపల్లిగూడెం