శేషాద్రికి గ్లోబల్ ఐకాన్ ఎడ్యుకేషన్ అవార్డు
శేషాద్రికి గ్లోబల్ ఐకాన్ ఎడ్యుకేషన్ అవార్డు
ప్రదానం
హొళగుంద , సూర్య (ఆలూరు )
హొళగుంద మండలం వందవాగలి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ కన్నడ పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్న హెచ్ వై శేషాద్రికి గోవాలో గత నెల 27 తేదీన శ్రీనిధి ఫౌండేషన్,కర్ణాటక, ప్రతిఫల ఫౌండేషన్ ధారవాడ ఆధ్వర్యంలో నిర్వహించిన కన్నడ సాంస్కృతిక సమ్మేళన కార్యక్రమాన్ని రవీంద్ర భవన వాస్కో గోవాలో నిర్వహించారు· ఆయన చేసిన శిక్షణ సేవలను గుర్తించి రాష్ట్రస్థాయిలో గ్లోబల్ ఐకాన్ ఎడ్యుకేషన్ అవార్డు అందుకున్నారు. అవార్డు గ్రహీత శేషాద్రికి గురువారం పాఠశాలలో ఉపాధ్యాయుల బృందం, ఎస్ఎంసి కమిటీ సభ్యులు, విద్యార్థులు శాలువాను పూలమాలను వేసి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కే. జంబునాత,వై. రమేష్ బి. రమేష్, నృపతుంగ, హనుమంతప్ప ,అశోక్ ,ఉష ఎస్ఎంసి వైస్ చైర్మన్ డి. లింగన్న, విద్యార్థులు పాల్గొన్నారు.